Begin typing your search above and press return to search.

'వారణాసి'లో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ... ఆలయాల్లో ప్రత్యేక పూజలు !

By:  Tupaki Desk   |   28 Jan 2021 10:00 PM IST
వారణాసిలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ... ఆలయాల్లో ప్రత్యేక పూజలు !
X
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ ‌రావు కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈరోజు, రేపు ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు వారణాసికి చేరుకున్నారు. అక్కడ రెండు రోజుల పాటు పలు ప్రాంతాలను వారు సందర్శించనున్నారు. ఇవాళ రేపు ఉత్తర ప్రదేశ్‌ లోని వారణాసిలో ఉంటారు.

ముందుగా అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి, గంగా పూజలు నిర్వహించనున్నారు. తర్వాత సంకట్‌ మోచన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వారణాసి పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. వారణాసి పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథున్ని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకోబోతుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం సహజంగా దైవభక్తి ఎక్కువ. గతంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ యాగాలు కూడా చేశారు. తాజాగా తెలంగాణలో సీఎం మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం వారణాసిలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.