Begin typing your search above and press return to search.

దేశానికి వారసత్వ జాఢ్యం

By:  Tupaki Desk   |   5 Sep 2018 6:47 AM GMT
దేశానికి వారసత్వ జాఢ్యం
X
ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజకీయ వారసత్వ జాఢ్యం భారత దేశాన్నే పీడిస్తోంది. దేశంలో రాజకీయ రంగంలోను - సినీ రంగంలోనూ ఈ వారసత్వ పోరు ప్రజలకు గుదిబండలా మారింది. క్రీడాకారుల వారసులు అదే క్రీడలోకి వచ్చిన దాఖాలాలు లేవు. ఒకవేళ వచ్చిన వారి ప్రతిభ ఆధరంగానే ఎదుగుదల ఉంటుంది. కాని భారత రాజకీయాలలో మాత్రం అర్హత - ప్రతిభ లేకుండానే కొందరు నాయకులు పాలన సాగిస్తున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలనే అవలంభిస్తోంది. భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్ నేహ్రు నుంచి నేటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరకూ అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారే. కాంగ్రెస్‌ పార్టీలో ఒకటి రెండు సార్లు ఇతర కుటుంబాల వారు అధికారంలోకి వచ్చిన వారు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఈ వారసత్వ రాజకీయాలకు ఉత్తరాది - దక్షిణాది అనే తేడా లేదు. జాతీయ పార్టీ - ప్రాంతీయ పార్టీ అనే బేధమే లేదు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుభవం లేకున్న ఆయననే తమ ప్రధాన మంత్రి అభ్యర్దిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ తనయున్నే ఆయన ముఖ్యమంత్రిని చేసారు. బిహార్‌ లో లాలుప్రసాద్ యాదవ్ తన వారసురాలిగా ఆయన భార్య రబ్రీదేవిని తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులను తీసుకు వచ్చే పనిలో పడ్డారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలలో ఈ వారసత్వం రాజ్య మేలుతోంది. దక్షిణ భారతంలో అయితే కేరళ మినహా అన్నీ రాష్ట్రాలలోను వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయి. సమైక్య ఆంద్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ వారసుడిగా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్‌ ను మంత్రిని చేసారు. లోకేష్‌ కు రాజకీయాల పట్ల గాని - పాలన పట్ల గాని కనీస అవగాహన లేదు. అయిన లోకేష్‌ చలమణి అవుతున్నారు. భవిష్య‌త్తులో చినబాబు ముఖ్యమంత్రి అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన కుమారుడు తారక రామారావును - కుమార్తే కవితను రాజకీయాలలోకి తీసుకు వచ్చారు. తన కుమారుడు తారక రామారావును మంత్రిని చేసారు. భవిష్యత్తులో తన వారసుడిగా తారక రామారావును ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందని అంటున్నారు.

కర్నాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ తన కుమారుడు కుమారస్వామిని ముఖ‌్యమంత్రిని చేసేందుకు నానా తంటాలు పడ్డారు. అక్కడి భారతీయ జనతా పార్టీ నాయకుడు ‍యడ్యూరప్ప కూడా తన వారసులను తీసుకువచ్చే పనిలో పడ్డారని వార్తలోస్తున్నాయి. తమిళనాడులో డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి తన కుమారులను - కుమార్తెను ఎప్పుడో రాజకీయాలలోకి తీసుకు వచ్చేసారు. ఈ వారసత్వ రాజకీయాలోకి జగన్ ఒక్కరే కాస్త భిన్నంగా వచ్చారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన పార్టీ నుంచి వైదొలగి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ విధంగా తన అస్థిత్త్వాన్ని కాపాడుకున్నారు. అలాగే వామపక్షాలకు చెందని నాయకుల వారసులు కూడా రాజకీయాల్లో ఉన్నట్లు దాఖాలాలు పెద్దగా లేవు. ఈ జాబితాలో కొన్ని రాష్ట్రాలలో బిజేపికి కూడా చోటు ఉంటుంది.