Begin typing your search above and press return to search.

ఎగబాకిన రూట్...పడిపోయిన విరాట్ కోహ్లీ !

By:  Tupaki Desk   |   2 Sept 2021 10:00 PM IST
ఎగబాకిన రూట్...పడిపోయిన విరాట్ కోహ్లీ !
X
విరాట్ కోహ్లీ .. ప్రపంచ క్రికెట్ రారాజు. అయితే గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్ తో కొనసాగుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లీ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయడం, అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రికార్డు స్థాయిలో మూడు సెంచరీలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ లో కోహ్లీపై పై చేయి సాధించిన జో రూట్, తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంక్సింగ్స్ లోనూ అదే జోరు కొనసాగించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో జో రూట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సిరీస్ లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రూట్ 916 పాయింట్లతో మొదటి స్థానాంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ విలియమ్సన్ (901) రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు.

మరోవైపు, బౌలింగ్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్ తన నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తో టెస్టు సిరీస్ లో అదరగొడుతోన్న ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఆరు నుంచి ఐదో స్థానానికి ఎగబాకాడు. భారత్ ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకున్నాడు.

కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. ఇందుకు రూట్ ఇంగ్లండ్‌ బౌలర్లకు క్రెడిట్ అందించాడు. ఈ ఘనత మా బౌలర్లకు మాత్రమే చెందుతుంది. సిరీస్ గెలవాలంటే, కోహ్లీ మౌనంగా ఉండాల్సిందే. కోహ్లిని పెవిలియన్ పంపందుకు మేము ఒక ప్లాన్‌ చేశాం. దాంతోనే మేం టీమిండియాపై ఒత్తిడి పెంచుతున్నాం. రాబోయే మ్యాచులో కోహ్లీ సేన పై మరింత ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తాం. వారిని పరుగులు చేయకుండా అడ్డుకోగలం. నిరంతరం టీమిండియాపై ఒత్తిడిని కొనసాగించడం ద్వారానే మేం ముందుకు సాగుతాం. సిరీస్‌ లో మేం బలంగా తిరిగి పుంజుకున్నాం.

ఇందుకు చాలా సంతోషంగా ఉన్నాం. సిరీస్‌ ను సమం చేయడానికి మేం చాలా కష్టపడ్డాం అంటూ వెల్లడించారు. ఇంగ్లండ్ కెప్టెన్ తన జట్టు ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా భారత్‌తో ఆడుతుందని తెలపాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారతదేశం ప్రపంచ స్థాయి జట్టుగా ఎదిగిందని తెలిపారు. మేం టీమిండియా నుంచి ఎదురుదాడిని ఆశిస్తున్నాం. రాబోయే మ్యాచులో అలసిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం సిరీస్‌ను సమం చేశాం. అలాగే రాబోయే మ్యాచులను గెలచి, సిరీస్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు.