Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో.. పాతబస్తీలో దొంగ ఓట్ల దందా..

By:  Tupaki Desk   |   8 Dec 2018 8:11 AM GMT
వైరల్ వీడియో.. పాతబస్తీలో  దొంగ ఓట్ల దందా..
X
తెలంగాణ ఎన్నికల సందర్భంగా వేసిన దొంగనోట్లకు సంబంధించిన వీడియో ఒకటి నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముస్లిం మహిళలు, పలువురు మైనర్ బాలికలు బురఖాలు ధరించి చాలాసార్లు ఓటేసినట్టు అర్థమవుతోంది. హైదరాబాద్ లోని చార్మినార్, యాకుత్ పుర, చంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో ఇలా ముస్లిం మహిళలు ఒకటికి పదిసార్లు నకిలీ ఓట్లు వేసినట్టు సమాచారం.

ఈ నియోజకవర్గాల్లో ఈసారి గట్టి పోటీనెలకొంది. కాంగ్రెస్, ఎంబీటీ, ఎంఐఎం హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మైనర్ బాలికలు, మహిళలు బురుఖాలు ధరించి ఓటేస్తూ కనిపించారు. వారు మళ్లీ వచ్చి స్పిరిట్ తో తమ చేతికి ఉన్న ఇంకును తొలగించుకొని ఓట్లు వేసేందుకు వెళుతున్న వీడియో మీడియాలో సంచలనంగా మారింది. ఇలా చాలా సార్లు ఇంకును స్పిరిట్ తో తొలగించుకోవడం.. మళ్లీ ఓటేసేందుకు వెళ్లడం వీడియోలో కనిపించింది.

మహిళలు దొంగ ఓట్లు వేసి వచ్చాక దాన్ని స్పిరిట్ తో శుభ్రం చేసేందుకు నిపుణులైన పార్టీల నాయకులు అక్కడే తిష్టవేసి ఈ పనులన్నీ చక్కదిద్దారు.. బయటకు వచ్చిన ఈ వీడియోలను బట్టి ఒక్కో మహిళ దాదాపు 50 సార్లు ఓటు వేసినట్టు అర్థమవుతోంది. దొంగ ఓట్లు వేయగానే వారికి అక్కడిక్కడే నగదును కూడా పార్టీల నేతలు అందజేయడం గమనార్హం.

హైదరాబాద్ లోని పాతబస్తీ ఎల్లప్పుడూ సున్నితమైన ప్రాంతం. ఇక్కడ మతకల్లోలాలు, హిందూ ముస్లిం గొడవలు కామన్. అందుకే మహిళలు ఇలా దొంగ ఓట్ల వేస్తున్నా.. వారిని తథేకంగా చూసి చెక్ చేయడానికి ఎన్నికల అధికారులు సాహసించలేకపోయారు. అందుకే మహిళలతో ఇలా పార్టీల నేతలు దొంగ ఓట్లు వేయించారు. మరి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలాంటి ఈ చర్య చూశాక ఈసీ ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాల్సిందే..