Begin typing your search above and press return to search.

బ్రాహ్మణిని ముగ్గులోకి లాగారు... ఈసారి టీడీపీ స్ట్రాంగ్ గానేనట..

By:  Tupaki Desk   |   26 Oct 2022 4:09 AM GMT
బ్రాహ్మణిని ముగ్గులోకి లాగారు... ఈసారి టీడీపీ స్ట్రాంగ్ గానేనట..
X
ఆమె నందమూరి తారకరాముని మనవరాలు. ప్రముఖ నటుడు బాలయ్య పెద్ద కుమార్తె. చంద్రబాబు కోడలు. లోకేష్ బాబు భార్య. అంతే కాదు ఆమె సొంతంగా పారిశ్రామికవేత్త. తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉండే నారా బ్రాహ్మణికి ఇపుడు ముగ్గులోకి లాగారు. ఆమె అసలు రాజకీయాల్లో లేరు. ఆమె పత్రికలలకు మీడియాకు కూడా ముఖం చూపించరు. అలాంటి బ్రాహ్మణి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ అని టీడీపీ మండిపోతోంది.

ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులను పదహారు వందల కోట్లు పెట్టి బ్రాహ్మణి కొందని, ఆమెకు ఇంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి చెందిన ఫాం హౌస్ కొనుగోలు చేసింది నిరుపేద చంద్రబాబు కోడలు బ్రాహ్మణి అంటూ సెటైర్లు వేశారు.

ఈ పోస్టులు అన్నీ కొడాలి నానీ, అనితా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ పేరిట మూడు ట్వీట్లుగా సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో టీడీపీ నుంచి గట్టి రియాక్షన్ వచ్చింది. ఈ అంశం మీద అమీ తుమీ తేల్చుకోవడానికి బ్రాహ్మణి సిద్ధంగా ఉన్నారని ఆమె పరువు నష్టం దావా వేస్తారని టీడీపీ వర్గాలు తెలియచేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తన కుటుంబం మీద తన సతీమణి మీద ఫేక్ పోస్టులు ఎవరైనా పెడితే క్షణాలలో పోలీసులను పంపించి వారిని అరెస్ట్ చేయిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఎన్టీయార్ మనవరాలు తన పని తాను చేసుకుని రాజకీయాలకు దూఒరంగా ఉండే బ్రాహ్మణి విషయంలో ఇలా తన పార్టీ వారు ఫేక్ పోస్టింగులు పెడితే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ల మీద మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి నానా హడావుడి చేసింది కదా ఇపుడు ఒక మహిళ మీద ఇలా పరువు తీసే పోస్టింగులు పెడితే ఆ కమిషన్ ఎలాంటి చర్యలూ తీసుకోదా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ఇదంతా చేయిస్తూ అయినింటి ఆడవాళ్ల మీద పోస్టింగులు పెట్టించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నిస్తున్నారు. దీని మీద బ్రాహ్మణి పరువు నష్టం దావా వేసి అసలైన వారిని బయటకు తెస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.