Begin typing your search above and press return to search.

100 మంది క‌రోనా రోగుల‌కు నకిలీ రెమ్ డెసివర్.. ఏం జరిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   16 May 2021 2:30 AM GMT
100 మంది క‌రోనా రోగుల‌కు నకిలీ రెమ్ డెసివర్.. ఏం జరిగిందో తెలుసా?
X
క‌రోనా విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వినిపిస్తున్న ప్ర‌ధాన విష‌యాలు రెండే. అందులో ఒక‌టి ఆక్సీజ‌న్ కాగా.. రెండోది రెమ్ డెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్‌. ఊపిరి స‌రిగా అంద‌ని వారికి ఈ మందును సిఫార‌సు చేస్తుంటారు వైద్యులు.

కొవిడ్ బాధితులు ప్ర‌ధానంగా ఎదుర్కొనే స‌మ‌స్య శ్వాస‌తీసుకోవ‌డ‌మే కావ‌డంతో.. ఈ ఇంజ‌క్ష‌న్ కు ఎక్క‌డ లేని డిమాండ్ పెరిగిపోయింది. సాధార‌ణంగా 2 నుంచి 3 వేల రూపాయ‌లు ఉండే ఈ మందును.. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో ఏకంగా 30 నుంచి 40 వేల‌కు అమ్ముతున్నారు.

అయితే.. అంత డ‌బ్బు తీసుకొని కూడా కొంద‌రు న‌కిలీ మందును అమ్ముతున్నారు. గుజ‌రాత్ కు చెందిన ఓ బ్యాచ్ గ్లూకోస్ వాట‌ర్‌, ఉప్పు క‌లిపిన మందును రెమ్ డెసివ‌ర్ అంటూ అమ్మేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ లో ఈ మోసం వెలుగు చూసింది. మొత్తం వంద మంది ఈ న‌కిలీ మందును కొనుగోలు చేసిన‌ట్టు తేలింది.

అయితే.. ఈ న‌కిలీ మందు తీసుకున్న వారిలో 90 మంది క‌రోనా బారినుంచి బ‌య‌ట ప‌డ‌డం గ‌మ‌నార్హం. 10 మంది మాత్ర‌మే చ‌నిపోయార‌ట‌. ఈ ఘ‌ట‌న‌పై కీల‌క అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాము రెమ్ డెసివ‌ర్ మందు తీసుకున్నామ‌నే మ‌నోధైర్య‌మే చాలా మందిని కాపాడి ఉండొచ్చ‌ని అంటున్నారు. చ‌నిపోయిన వారిలో ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండి ఉండొచ్చ‌ని అంటున్నారు.

అందువ‌ల్ల‌.. అంద‌రూ మ‌నో ధైర్యంతో కొవిడ్ ను ఎదుర్కోవాల‌ని సూచిస్తున్నారు. ఇక‌, బ్లాక్ ఫంగ‌స్ విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెమ్‌డెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ అధిక వాడకం కూడా ఈ వ్యాధికి కార‌ణం అవుతుంద‌ని వైద్యులు చెబుతున్న‌ట్టు స‌మాచారం. కాగా.. న‌కిలీ మందు విక్ర‌యించిన గుజ‌రాత్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది