Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో ఫేక్ ‌న్యూస్ ప్రచారం ..60 ఏళ్ల వృద్ధ మహిళపై కేసు!

By:  Tupaki Desk   |   19 May 2020 4:20 PM IST
సోషల్ మీడియాలో ఫేక్ ‌న్యూస్ ప్రచారం ..60 ఏళ్ల వృద్ధ మహిళపై కేసు!
X
సోషల్ మీడియా ..సోషల్ మీడియా ..ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ సోషల్ మీడియా పైనే ఆధారపడి ముందుకువెళ్తుంది. అయితే, ఈ సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత ఏది నిజమో ..ఏది అబద్దమో తెలియడంలేదు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా పనిగట్టుకునొ కొన్ని ఫేక్ వార్తలు సృష్టించి వైరల్ ‌గా చేస్తే.. కొందరు తెలిసి తెలియక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఒక్కోసారి వారిని చిక్కుల్లో నెడుతున్నాయి.

కాగా, గ్యాస్ ‌లీక్‌ ఘటనతో విశాఖ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా కుటుంబాలకు, ఈ ఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందినవారికి.. చివరకు ఐదు బాధిత గ్రామాల్లోని ప్రతీ ఒక్కరికీ పరిహారం చెల్లించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు., ఈ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌ బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్‌ పెట్టారంటూ గుంటూరులో రంగనాయమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.

గుంటూరు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలో నివాసం ఉండే పూందోట రంగ నాయకమ్మను కలిసిన సీఐడీ సీఐ దిలీప్‌కుమార్‌ ఈ మేరకు నోటీసు అందజేశారు. గ్యాస్ లీక్‌ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులపై విచారణ చేయగా.. ప్రాథమికంగా వాటిని రంగనాయకమ్మ పోస్టు చేసినట్టు గుర్తించామని, ఆమెకు సీఆర్‌ పీసీ సెక్షన్‌ 41-ఎ ప్రకారం నోటీసు ఇచ్చామని తెలిపారు సీఐడీ అధికారులు.

అయితే, ఈ పోస్ట్ పెట్టడానికి ఆమెకు సహకరించిన మల్లాది రఘునాథ్‌ గురించి కూడా దర్యప్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇకపోతే, ఈ కేసులో నేరం రుజువైతే.. తొలిసారి మూడేళ్ల జైలు, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరోసారి ఇదే నేరం మరోసారి రిపీట్ అయితే మాత్రం ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ 60 ఏళ్ల వృద్ధురాలి పరిస్థితి ఏమిటో వేచిచూడాలి.