Begin typing your search above and press return to search.

ఆ దేశంలో ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరికి ఫేక్ లైసెన్స్ !

By:  Tupaki Desk   |   28 Jun 2020 5:00 AM IST
ఆ దేశంలో ప్రతి ముగ్గురు పైలట్లలో  ఒకరికి ఫేక్ లైసెన్స్ !
X
నకిలీ డిగ్రీ, పీజీ, డాక్టర్ సర్టిఫికేట్లు, నకిలీ భూ డాక్యుమెంట్లు, నకిలీ వాహనలైసెస్సులు, ఓటరు కార్డులు.. అబ్బో... ఇలాంటి నకిలీల గురించి మనం నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాము. అసలు ఈ మధ్య కాలంలో నకిలీ ఎదో ..ఒరిజినల్ ఎదో గుర్తుపట్టడానికి కూడా లేకపోయింది. తాజాగా పాక్ లో నకిలీ సర్టిఫికెట్ల బెడద ఊహించని రేంజ్‌కు వెళ్లిపోయింది. పాక్‌లో కొన్ని పైలట్ లైసెన్సులు కూడా నకిలీవేనట. ఒకరో ఇద్దరో కాదు.. దురదృష్టవశాత్తూ అక్కడ ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్ లైన్సెసులతోనే హ్యాపీగా బతికేస్తున్నారట.

ఇదేమీ స్టింగ్ ఆపరేషన్ ‌లో బయటపడ్డ విషయం కాదు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంతో గుండె చెదిరిన పౌర విమానాయ శాఖ మంత్రి స్వయంగా బయటపెట్టిన దారుణ వాస్తవం. ఈ క్రమంలో పాకిస్తాన్ లో 30 శాతం పైచిలుకు పైలట్లు విమానం నడిపేందుకు అనర్హులు. వారెవరూ పరీక్షకు స్వయంగా హాజరు కాలేదు. తమ తరఫున పరీక్ష రాసేందుకు కొందరికి డబ్బులిచ్చి పంపారు. విమానం నడపడంలో వారికి కావాల్సినంత అనుభవం లేదు అని నిండు సభలో మంత్రి ప్రకటించారు.

పాక్ సంస్థల్లో ప్రస్తుతం దాదాపు 860 పైలట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే నకిలీ లైసెన్సుల గలవారందరినీ ప్రభుత్వం తక్షణం సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి కారణమైన పైలట్ల వద్ద ఎటువంటి లైసెన్సులు ఉన్నాయనే దానిపై కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు.