Begin typing your search above and press return to search.

పోలీసుల పేరుతో నకిలీ పేస్ బుక్ అకౌంట్లు..సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు!

By:  Tupaki Desk   |   1 Oct 2020 5:00 PM IST
పోలీసుల పేరుతో నకిలీ పేస్ బుక్  అకౌంట్లు..సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు!
X
తెలంగాణ పోలీసుల ప్రొఫైల్స్ ‌తో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి , ఇష్టానుసారవంగా డబ్బు కాజేస్తున్న ముఠా గుట్టు బయటపెట్టి , వారి ఆటకట్టించారు నల్గొండ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి 10 మంది పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ నుండి ఈ ముఠా ఈ తరహా మోసాలకు పాల్పడుతుందని తెలిపారు. పోలీసుల ప్రొఫైల్స్‌ తో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, డబ్బు అవసరం ఉంది.. గూగుల్ పేలో మనీ పంపాలంటూ ఈ కన్నింగ్ బ్యాచ్ దేశవ్యాప్తంగా లక్షల్లో డబ్బు కాజేసినట్టు తెలిపారు.

నల్గొండ ఎస్పి రంగనాథ్ పేరుతో మొదలైన ఫేక్ ప్రొఫైల్స్ వ్యవహారం , తెలంగాణలోని ఏకంగా 100 మంది పోలీసుల ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ తో సైబర్ నేరాలకు ఈ ముఠా పాల్పడింది. వీరి నుండి భారీగా ఫోన్ సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక్కో నిందితుడి నుండి 100 కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోవడం విశేషం. విచారణలో దేశవ్యాప్తంగా 230 మంది పోలీసుల ప్రొఫైల్స్ తో వీళ్లు మోసాలకు పాల్పడినట్టు నల్గొండ పోలీసులు వెల్లడించారు. అడిషనల్ డిజి నుండి కానిస్టేబుల్స్ వరకు ఫేక్ అకౌంట్స్ తో హడలెత్తించిన ముఠా సభ్యుల్లో మైనర్ లే ఎక్కువ కావడం ఆసక్తికర అంశం. వీరంతా కేవలం 8, 9 తరగతులు మాత్రమే చదువుకున్నవాళ్లు కావడం మరో విశేషం. తెలంగాణ, ఏపి, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడిశా రాష్ట్రంలోని పోలీస్ ప్రొఫైల్స్ ను వాడుకుని ఈ మైనర్లు మోసాలకి పాల్పడ్డారు. భరత్ పూర్ లో నిందితుల నుండి ప్రతిఘటన ఎదురు కాకుండా చాకచక్యంగా వ్యవహరించి కథ నడిపించి నిందితుల్ని అరెస్ట్ చేశారు నల్గొండ పోలీసులు.