Begin typing your search above and press return to search.
ఈ దొంగ నోట్లకు కంటైనర్ కూడా సరిపోదు ఏమో!
By: Tupaki Desk | 11 Jun 2020 1:40 PM ISTదేశంలో భారీ ఎత్తున నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. సుమారు రూ.87కోట్ల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు ఈ రాకెట్ ను ఛేదించారు. కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీని చూసి పోలీసు ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఐదుగురు సాధారణ పౌరులు కాగా, ఓ జవాన్ కూడా ఉన్నట్టు తెలిపారు.
దొంగ నోట్ల రాకెట్ కు సంబంధించి మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో జాయింట్ సీపీ ఆదేశాలతో క్రైం డీసీపీ బచ్చన్ సింగ్ ఆపరేషన్ చేపట్టారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో బుధవారం మధ్యాహ్నం దాడులు చేశారు. ఓ జవాన్, మరికొందరు కలసి దొంగ నోట్లను ముద్రిస్తుండగా పట్టుకున్నారు. అందులో భారతీయ కరెన్సీతో పాటు అమెరికన్ డాలర్లు కూడా ఉన్నాయి. వీటిలో వెయ్యి రూపాయల నోట్లను మినహాయించి రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీ ఉన్నట్టు వివరించారు.
దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారనీ అదుపులోకి తీసుకున్న జవాన్ ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించామని తెలిపారు. అరెస్టయిన ఆరుగురిలో భారత ఆర్మీ జవాన్ షేక్ అలీమ్ గులాబ్ ఖాన్, ఇతరులు సునీల్ బద్రీనారాయణ సర్దా, రితేష్ రత్నాకర్, తుఫైల్ అహ్మద్ మహ్మద్ ఖాన్, రెహ్ముతుల్లా ఖాన్, అబ్దుల్ రెహమాన్ ఖాన్ అని పూణే సంయుక్త పోలీసు కమిషనర్ రవీంద్ర షిస్వే తెలిపారు.