Begin typing your search above and press return to search.

ప్రేమలో ఓడిపోయి ప్రముఖ ఛానల్ ఉద్యోగి ఆత్మహత్య !

By:  Tupaki Desk   |   15 July 2020 3:30 PM IST
ప్రేమలో ఓడిపోయి ప్రముఖ ఛానల్ ఉద్యోగి ఆత్మహత్య  !
X
ప్రేమ ..ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తెలిసి తెలియని వయస్సులో ప్రేమ అంటూ కొందరు జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే , మరికొందరు ప్రేమలో విఫలమై జీవితాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ప్రేమలో విఫలం అయింది అని బలవనతంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన గాంధీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.

స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాలని చూస్తే .. సిద్దిపేటకి చెందిన పయ్యావుల రాములు కుమార్తె పి.కళ్యాణి ఓ న్యూస్‌ చానల్‌ లో పని చేస్తూ . అదే సంస్థలో పనిచేస్తున్న శివ తో ప్రేమ వ్యవహారం నడుపుతుంది. అయితే , ఈ మధ్య కళ్యాణి ప్రేమించిన శివని తనను వివాహం చేసుకోవాలని కోరింది. దానికి శివ నిరాకరించడంతో ఇక బ్రతకడం వృధా అని భావించి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కళ్యాణి తన సోదరుడు కలిసి బోలక్‌ పూర్‌ లో ఉంటున్నారు. సోదరుడు ఓ బార్బర్‌ షాపులో పనిచేస్తుంటాడు. తన పని మీద ఆమె సోదరుడు ఆలా బయటకి వెళ్ళగానే ఆమె ఫ్యాన్ కి ఉరేసుకుంది. ఆమె సోదరుడు రాత్రి వచ్చి చూసే సరిగా ఇంట్లో కళ్యాణి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. దీనితో వెంటనే గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి , పోస్టుమార్టం తరువాత శవాన్ని బంధువులకి అప్పగించారు. తన కుమార్తె మృతికి ఆ శివే కారణం అని తండ్రి ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.