Begin typing your search above and press return to search.

బ‌య‌ట‌కు పొక్కిన గులాబీ.. క‌మ‌లం పొత్తు!

By:  Tupaki Desk   |   8 Sep 2018 6:05 AM GMT
బ‌య‌ట‌కు పొక్కిన గులాబీ.. క‌మ‌లం పొత్తు!
X
బాహాటంగా తిట్టుకుందాం. ఒక‌రిపై ఒక‌రు మ‌ర్యాద‌గా విమ‌ర్శ‌లు సంధించుకుందాం. ఒక‌రి ప‌రువు మ‌రొక‌రు తీసుకోకుండా మాట‌లు అనేసుకుందాం. మ‌మ్మ‌ల్ని గెలిపించే బాధ్య‌త మాది. మిమ్మ‌ల్ని విజ‌య తీరాల‌కు తీసుకెళ్లటం మా క‌ర్త‌వ్యం. మీరూ.. మేము క‌లిసి ఉందాం. కానీ.. వేర్వేరుగా పోటీ చేద్దాం. బ‌హిరంగంగా ఎన్ని అనుకున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం మీకు మేము.. మాకు మీరు.

ఇదేనా.. గులాబీ..క‌మ‌లం మ‌ధ్య‌న కొత్త డీల్? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌ను తాను కోరుకున్న‌ట్లే పావులు క‌దిపి.. అసెంబ్లీని ర‌ద్దు చేసిన కేసీఆర్‌.. 105 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌టం ద్వారా విప‌క్ష‌పార్టీల‌కే కాదు.. సొంత పార్టీ నేత‌ల‌కు సైతం త‌న‌దైన శైలిలో షాకిచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

పేరుకు ఎన్నిక‌ల అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసేందుకు క‌మిటీ ఏర్పాటుచేసిన‌ట్లుగా చెప్పినా.. అభ్య‌ర్థుల సెల‌క్ష‌న్ మొత్తం కేసీఆరే ఫైన‌ల్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న తుది జాబితాను కుటుంబ స‌భ్యుల‌కు సైతం చూపించ‌కుండా నేరుగా మీడియా స‌మావేశంలో బ‌య‌ట‌పెట్టి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేశార‌ని చెబుతున్నారు.

ఈ లిస్ట్ ప్ర‌క‌టించినంత‌నే ప‌లువురికి ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపించాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల‌కు 14 స్థానాల్లో అభ్య‌ర్థుల్ని కేటాయించ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. అందులో ఏడు స్థానాలు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అన్నింటికి మించిన ఆశ్చ‌ర్యం ఏమంటే.. గ్రేట‌ర్ లో ప్ర‌క‌టించ‌ని ఏడు స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌వి కాగా.. ఒక‌టి మ‌జ్లిస్.. ఒక‌టి టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌వి కావ‌టం గ‌మ‌నార్హం.

దీని వెనుక ఏదైనా కార‌ణం ఉందా? అన్న దానిపై భారీగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏమంటే.. గులాబీ పార్టీతో బీజేపీకి ర‌హ‌స్య పొత్తు ఉంద‌న్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప‌క్కా వ్యూహం తాజాగా బ‌య‌ట‌కు పొక్కింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న ఐదు సీట్లు వ‌చ్చేలా చేయ‌టం కేసీఆర్ బాధ్య‌త అని.. దీనికి ప్ర‌తిఫ‌లంగా టీఆర్ఎస్ కు బీజేపీ ద‌న్నుగా నిలుస్తుంద‌ని.. బ‌ల‌మైన అభ్య‌ర్థుల్ని బ‌రిలో ఉంచ‌ర‌ని చెబుతున్నారు.

ఇలా ఎలా చెబుతారు? ఏమైనా ఫ్రూప్ ఉందా? అంటే లేద‌నే చెప్పాలి.

కానీ.. బ‌య‌ట‌కు పొక్కిన ఈ పొత్తు ఎత్తును త‌ర్కంగా చూస్తే.. విష‌యం ఇట్టే అర్థ‌మైపోవటం ఖాయం. మొన్న కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 స్థానాల సంగ‌తే చూద్దాం. అందులో 104 వ‌దిలేసి.. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని చూద్దాం.అక్క‌డ బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆ స్థానానికి బ‌ల‌మైన అభ్య‌ర్థి అంటే.. మేయ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న బొంతు రామ్మోహ‌న్‌. ఆయ‌న కానీ బ‌రిలోకి దిగితే టీఆర్ ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని చెబుతారు. మ‌రి.. అలాంటి చోట కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితుడైన బొంతుకు ఇవ్వ‌కుండా.. బ‌య‌ట‌కు కూడా పెద్ద‌గా రాని భేతి సుభాష‌ణ్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చిన‌ట్లు? అంటే.. పొత్తుఎత్తులో భాగంగానే చెప్పొచ్చు.

బీజేపీ అభ్య‌ర్థులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాలుగు స్థానాల్ని వ‌దిలేసి.. ఒక్క‌స్థానానికే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌టం వెనుక కార‌ణం లేక‌పోలేదు. మిగిలిన నాలుగు చోట్ల టీఆర్ఎస్ కు బ‌ల‌మైన అభ్య‌ర్థులుసిద్ధంగా ఉన్నారు. అందుకే వాటిని హోల్డ్‌లో పెట్టిన కేసీఆర్‌.. ఉప్ప‌ల్ ప్ర‌క‌టించేశారు. వాస్త‌వానికి ఉప్ప‌ల్ బీజేపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ కు సానుకూల వాతావ‌ర‌ణం లేదు. స్థానికంగా ఆయ‌న‌పై కాస్తంత వ్య‌తిరేక‌త ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇలాంటి వేళ‌లో.. ప్ర‌భాక‌ర్ కు త‌మ కార‌ణంగా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే భేతి సుభాష‌ణ్ రెడ్డిని బ‌రిలోకి దింపిన‌ట్లుగా చెబుతున్నారు. అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌ని రెండు స్థానాల్ని ఉదాహ‌ర‌ణ‌లుగా చూస్తే.. అందులో ఒక‌టి బీజేపీ సీనియ‌ర్ నేత ల‌క్ష్మ‌ణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్నే చూస్తే.. ఇక్క‌డ టీఆర్ ఎస్ టికెట్ ఆశిస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు.. తాజా మాజీ మంత్రి నాయిని అల్లుడు శ్రీ‌నివాస‌రెడ్డి. కావాలంటే తాను బ‌రిలో నుంచి త‌ప్పుకుంటాన‌ని.. త‌న‌కు ప‌ద‌వి కూడా అక్క‌ర్లేద‌ని.. త‌న అల్లుడికి ముషీరాబాద్ సీటు ఇవ్వాల్సిందిగా నాయిని పెద్ద ఎత్తున అడిగిన‌ట్లుగా తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ఆ స్థానంలో అభ్యర్థిని ప్ర‌క‌టించ‌కుండా హోల్డ్ లో ఉంచ‌టానికి కార‌ణం ఇదేన‌ని చెబుతున్నారు. అదే రీతిలో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా చెప్పాలి.

ఈ స్థానాన్ని పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డి.. కేకే కుమార్తెతో పాటు మాజీ మంత్రి.. కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వ‌చ్చిన చేరిన దానం నాగేంద‌ర్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్క‌రికి ఇచ్చినా గులాబీ జెండా ఖైర‌తాబాద్‌ లో రెప‌రెప‌లాడ‌టం ఖాయం. అయిన‌ప్ప‌టికీ ప్ర‌క‌టించ‌కుండా ఉండ‌టానికి కార‌ణంగా బీజేపీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డిగా చెబుతున్నారు. బీజేపీతో ర‌హ‌స్య పొత్తు పెట్టుకున్న వైనం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ తీరుపై అటు టీఆర్ ఎస్‌ లోనూ.. ఇటు బీజేపీలోనూ అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.రెండు పార్టీల అధినాయ‌క‌త్వాలు ర‌హ‌స్యంగా నిర్ణ‌యం తీసుకోవ‌టం.. ఎలాంటి సంకేలాలు లేకుండా అయోమ‌యానికి గురి చేయ‌టం లాంటి వాటితో న‌స్టం ఎక్కువగా జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి.. కేసీఆర్‌.. మోడీలు క‌లిసి ఆడుతున్న ఈ గేమ్ రిజ‌ల్ట్ అంతిమంగా ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.