Begin typing your search above and press return to search.

పీకే గాలి బుడగనా? కాలం కలిసొచ్చింది అంతే..

By:  Tupaki Desk   |   15 Feb 2020 4:30 PM GMT
పీకే గాలి బుడగనా? కాలం కలిసొచ్చింది అంతే..
X
కాలం కలిసొస్తే పేద కూడా రాజు అవుతాడు. అదృష్టం అంటే అతడిది. ప్రజల నాడీ తెలుసుకుని.. ఏ పార్టీ ముందే గెలుస్తుందని భావించి ఆ పార్టీ పక్కన చేరిపోయి ఆ పార్టీలు గెలవగానే తన వల్లనే గెలిచిందని ప్రకటించుకోవడం.. ఒక పరమైన తెలివితనం కూడిన వ్యాపారం. గెలిచే పార్టీకి కొంత సహాయం చేసి వాళ్ల గెలుపును తన గెలుపుగా ప్రకటించే వ్యక్తి రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ది. ఆయన ఇన్నాళ్లు రాజకీయ పార్టీలతో సహవాసం చేసినవన్నీ ప్రస్తుతం అధికారంలోకి రావడం కూడా కారణం అదే. వాస్తవాలు పరిశీలిస్తే ప్రశాంత్ కిశోర్ చేసేందేమీ లేదని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రశాంత్ కిశోర్ తన పనితనం నరేంద్రమోదీ నుంచి మొదలుపెట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పారిశ్రామికీకరణకు పెద్దపీట, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారీగా చేపట్టారు. అయిన ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ పరిచయమై బీజేపీ తరఫున గుజరాత్ లో ఎన్నికల కోసం ప్రయాణించాడు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిచి నరేంద్రమోదీ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ ప్రశాంత్ కిశోర్ వల్లనే బీజేపీ గెలిచిందని ప్రచారం బాగా సాగింది. పీకే కూడా అది తన గెలుపు అని భావించి ఆ విధంగా ముందుకు సాగాడు. వారి బంధం అలా కొనసాగుతుండగానే 2014 లోక్ సభ ఎన్నికలు వచ్చాయి.

ఆ సమయంలో బీజేపీకి, ముఖ్యంగా నరేంద్రమోదీ వెంట ప్రశాంత్ కిశోర్ ఉన్నాడు. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీగా ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఈ గెలుపులో ప్రశాంత్ కిశోర్ పాత్ర చాలా ఉందని మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. పీకే వలన మోదీకి అద్భుత విజయం సాధ్యమైందని అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఈ గెలుపులో ప్రశాంత్ కిశోర్ చేసిందేమీ లేదు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పరిపాలించింది. అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నాళ్లని కాంగ్రెస్ ను ఆదరించాలని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ కనిపించారు. ఆయనకు ఓట్లు గుద్దేశారు. అంతే దానికి ప్రశాంత్ కిశోర్ కొంత కార్పొరేట్, సాంకేతికత వినియోగించుకున్నాడు. మినహా పెద్దగా చేసేందేమీ లేదు. పీకే లేకున్నా నరేంద్రమోదీ నేతృత్వం లో బీజేపీ అద్భుతమైన ఫలితాలు పొంది ఉండేది.

ఇక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోనూ సేమ్ పరిస్థితి. అప్పటికే అక్కడ సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ మధ్య అధికారం బదిలీ అవుతోంది. తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పడడం లేదు. అక్కడ గత ప్రభుత్వంపై విరక్తితో అప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడంతో ఆ చరిష్మా ఉత్తరప్రదేశ్ లో కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొన్నాళ్లకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రావడంతో నరేంద్రమోదీ గాలి వీచడంతో యూపీలో బీజేపీ గెలిచింది. ఇక్కడ మోదీ చరిష్మా, బీజేపీ గాలి వీచింది. ఇక్కడ పీకే ఒరగబెట్టిందేమీ లేదు.

ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచాడు. వైఎస్సార్సీపీకి ప్రశాంత్ కిశోర్ రెండేళ్ల పాటు సేవలందించాడు. ఏం అందించాడేమో కానీ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, తనకున్న అభిమానంతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ గెలిచింది. ఎందుకంటే 2014 ఎన్నికల్లోనే కొద్ది మొత్తం ఓట్ల తేడాతో అధికారానికి జగన్ దూరమయ్యారు. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడని అందరికీ తెలిసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు పాలన సక్రమంగా లేకపోవడం.. అవినీతి, దౌర్జన్యాలు పెరిగిపోవడంతో ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు జగన్ ను గెలిపించాలని. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ ఉండడంతో వైఎస్సార్సీపీ గెలుపు కూడా తనదిగా పేర్కొంటున్నాడు.

ప్రశాంత్ కిశోర్ పనితనం ఏమిటో భవిష్యత్ ఎన్నికలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో పీకే అసలు పరీక్ష ఎదుర్కొనబోతున్నాడు. ఇక్కడ ఆ రెండు పార్టీలు గెలవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరం. మరీ ప్రశాంత్ కిశోర్ వచ్చాడు.. ఆ పార్టీలదే గెలుపు అని అందరూ భావిస్తున్నారు. మరీ ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీలు అధికారంలోకి వస్తే అప్పుడు ప్రశాంత్ కిశోర్ పనితనం ఏమిటో.. వాస్తవంగా అతడికి అంత సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఆ పార్టీలు గనుక ఓడిపోతే పీకే ఉత్తి బుడగలాంటి వ్యక్తి అని ఫిక్సయిపోవచ్చు. ఇప్పటికే ఆ పేరు వచ్చింది కానీ ఆ ఫలితాలు ఆ పేరును ఫిక్స్ చేసేస్తారు.