Begin typing your search above and press return to search.

దరిద్రం కొట్టు దందా అంటే ఇదే.. వాడేసిన కండోమ్స్ మళ్లీ అమ్మారు!

By:  Tupaki Desk   |   25 Sept 2020 2:00 PM IST
దరిద్రం కొట్టు దందా అంటే ఇదే..  వాడేసిన కండోమ్స్ మళ్లీ అమ్మారు!
X
బహుశా ప్రపంచంలోనే ఇంత దరిద్రం కొట్టు వ్యాపారం, పని మరొకటి ఉండదేమో.. ఒకసారి వాడి పారేసిన కండోమ్​లను మళ్లీ విక్రయించింది ఓ ముఠా. ఎంతో కాలంగా ఈ దందా సాగుతున్నప్పటికీ ఇటీవలే పోలీసులు ఈ దందాను బయటపడ్డారు. దాదాపు 3.45 లక్షల కండోములను స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణమైన ఘటన జరిగింది మనదేశంలో కాదులెండి వియత్నాంలో.. ఆ దేశంలోని బిన్ దుంగ్ ఫ్రావిన్స్ కు చెందిన ఓ ముఠా వాడేసిన కండోములను సేకరిస్తోంది. అనంతరం వాటిని వేడినీటి లో శుభ్రం చేసి సరి కొత్తగా ప్యాక్​ చేసి మార్కెట్​ లో విక్రయిస్తోంది. అయితే ఈ ముఠా ఇప్పటికే ఎన్నివేల కండోములు ఇలా విక్రయించిందో ఇంకా తెలియదు. పోలీసుల విచారణలో ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా ఓ మహిళ వద్ద ఈ తరహా కండోములను పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తే రాకెట్​ బయటకు వచ్చింది. ముఠా సభ్యులు తనకు కండోములను కేజీల లెక్కన అమ్ముతున్నారని కేజీకి 0.17 డాలర్లు తీసుకుంటున్నారని సదరు మహిళ చెప్పింది.

అనంతరం పోలీసులు పక్కా సమాచారంతో ఓ వేర్ హౌజ్ పై దాడులు నిర్వహించగా.. మొత్తం 3.50 లక్షల వాడిన కండోమ్స్ బయటపడ్డాయి. వాటి బరువు 350 కిలోల వరకు ఉన్నట్టు సమాచారం. ఈ గ్యాంగ్ వెనకున్న అసలు సూత్రధారుల్ని సాధ్యమైనంత తొందర్లోనే పట్టుకుంటామని అధికారులు అన్నారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాడేసిన కండోమ్​ ప్యాకెట్లను కుప్పలు, కుప్పలుగా తెచ్చి వీరికి ఇచ్చి వెళ్తున్నారు. అయితే ఈ ముఠా కోసం మొత్తం ఎంత మంది పని చేస్తున్నారు. దేశం లో ఇంకా ఇటువంటి ముఠాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో పోలీసు లు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఓ సారి వాడిన కండోమ్​లను మళ్లీ వాడితే ప్రమాదమైన.. ఎయిడ్స్​ వంటి భయంకర రోగాలు, లైంగిక పరమైన ఇతర వ్యాధులు రావొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.