Begin typing your search above and press return to search.

ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడిని కాపాడిన ఫేస్ బుక్

By:  Tupaki Desk   |   10 Sep 2022 10:31 AM GMT
ఆత్మహత్యకు  సిద్ధమైన యువకుడిని కాపాడిన ఫేస్ బుక్
X
తీవ్ర మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూసి ఫేస్ బుక్ రియల్ టైం టెక్నాలజీ ఆ మెసేజ్ ను గుర్తించింది. సకాలంలో స్పందించిన ఫేస్ బుక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందివ్వడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి. పోలీసులు వేగంగా స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడారు.

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. దీనిపై పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫేస్ బుక్ సిబ్బంది సమాచారం అందజేశారు.

వెంటనే ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా లోకేషన్ ను గుర్తించిన పోలీసులు యువకుడి ఇంటికి చేరుకొని రక్షించారు. ప్రాణహాని పరిస్థితులు పోస్ట్ ల విషయంలో ఫేస్ బుక్, యూపీ పోలీసుల మధ్య ఓ ఒప్పందం ఉంది.

నీట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో యువకుడు డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ఫేస్ బుక్ స్పందించి కాపాడినట్టైంది. పోలీసులు కూడా వేగంగా స్పందించారు.

ఓ నీట్ విద్యార్థి ప్రాణాలు కాపాడిన పోలీసులు, ఫేస్ బుక్ ను అందరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మంచి పనులు కూడా అవుతున్నాయని కొనియాడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.