Begin typing your search above and press return to search.

ప్రేమ‌-పెళ్లి-శోభ‌నం.. త‌ర్వాత‌ షాకింగ్ ఎవ‌రికీ జ‌ర‌గ‌దు బ్రో!

By:  Tupaki Desk   |   3 Nov 2022 4:10 AM GMT
ప్రేమ‌-పెళ్లి-శోభ‌నం.. త‌ర్వాత‌ షాకింగ్ ఎవ‌రికీ జ‌ర‌గ‌దు బ్రో!
X
ఆ ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చాటింగ్ పెరిగింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది. కొద్ది రోజులు ప్రేమలో మునిగి తేలిన ఆ జంట.. తాజాగా వివాహ బంధంతో ఒక్కటయింది. ఆ తర్వాతే వరుడికి ఊహించని షాక్ తగిలింది.

శోభనం రోజు వధువు గురించి అసలు విషయం తెలిసి అతడు కంగుతిన్నాడు. చివరికి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన యువకుడికి హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన యువతి.. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే ప్రేమలో పడ్డ ఆ ఇద్దరూ.. అనంత‌రం కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులకు విషయం చెప్పకుండానే.. గుడిలో వివాహం చేసుకున్నారు.

త‌ర్వాత‌ ఆ యువకుడు ఆమెతో కలిసి నేరుగా తన ఇంటికి వెళ్లాడు. చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చిన కుమారుడిని చూసి కుటుంబ మొదట్లో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. ఆ తర్వాత వాళ్ల పెళ్లిని ఆంగీకరించారు. ఈ క్రమంలోనే రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు.

నూతన వధూవరులద్దిరినీ గదిలోకి పంపించారు. ఈ నేపథ్యంలో వధువు గురించి వరుడికి సంచలన విషయం తెలిసింది. తాను పెళ్లి చేసుకుంది.. అమ్మాయిని కాదని, ఒక నపుంసకుడిని అని తెలిసి ఆ యువకుడు బిత్తరపోయాడు.

విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. పెళ్లిని రద్దు చేయాలని కోరాడు. అయితే.. వధువు(అతడు) మాత్రం అందుకు ఒప్పుకేలేదు. చివరికి తనకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.