Begin typing your search above and press return to search.
దేశముదురు గ్యాంగ్.. పోలీసులకే చెమటలు!
By: Tupaki Desk | 4 Sept 2020 2:20 PM ISTసైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏదొక విధంగా ఉచ్చులోకి లాగి అనుమానం తలెత్తేలోపే అందినకాడికి దోచుకు పోతున్నారు. ఫేస్బుక్లో ఎస్సై ఫొటోను ఫ్రొఫైల్ పిక్‌గా పెట్టి డబ్బులు వసూలు చేసిన ఓ మాఠా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో కలకలం రేపింది. అద్దంకి ఎస్సై వేలగా మహేశ్ పేరుతో సైబర్ ముఠా ఓ నకిలీ ఫేస్బుక్ ఐడీని క్రియేట్ చేసింది. అనంతరం అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన వారందరినీ యాక్సెప్ట్ చేస్తూ.. డబ్బులు అడగడం మొదలు పెట్టారు. తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని వెంటనే పదివేలు పంపించాలంటూ ఎస్సై పేరుతో మెసేజ్‌లో వచ్చేవి. నమ్మిన కొందరు వ్యక్తులు .. సదరు వ్యక్తుల చెప్పిన గూగుల్ పే నంబర్‌కు డబ్బులు పంపించారు.
ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్న పలువురు ఎస్సై స్నేహితులు డబ్బులు పంపించారు. తర్వాత ఓ సారి ఎస్సై కలిసినప్పడు డబ్బులు పంపిన విషయం ప్రస్తావించారు. దీంతో అసలు మోసాన్ని గ్రహించిన ఎస్సై విచారణ చేపట్డడంతో మోసగాళ్ల అసలు రంగు బయటపడింది. దీంతో ఎస్సై ఫేస్బుక్ లైవ్ పెట్టి తన పేరుతో ఓ ఫేక్ ఐడీని క్రియేట్ చేశారని.. అర్జెంట్‌గా రూ.10 వేలు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారని.. వారిని అస్సలు నమ్మోద్దని చెప్పాడు. దీనిపై పోలీస్‌శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఈ సైబర్ ముఠా మరికొందరు పోలీసుల పేరుతోకూడా ఫేక్ ఐడీని క్రియేట్ చేసినట్టు సమచారం. ప్రస్తుతం ఆ ముఠాలో ఎవరెవరు ఉన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.