Begin typing your search above and press return to search.

జుక‌ర్‌ బ‌ర్గ్‌ పై ఫేస్‌ బుక్ వాటాదారు సంచ‌ల‌న కేసు!

By:  Tupaki Desk   |   28 July 2018 10:41 AM GMT
జుక‌ర్‌ బ‌ర్గ్‌ పై ఫేస్‌ బుక్ వాటాదారు సంచ‌ల‌న కేసు!
X
ఫేస్‌ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌ బర్గ్... ఈనెల మొద‌టివారంలో ఓ సంచ‌ల‌న వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో మూడో వ్యక్తి అయ్యారు. ఈ హోదా దక్కడం జూకర్‌ బర్గ్‌ కు ఇదే తొలిసారి. ప్రముఖ వ్యాపారవేత్త - బెర్క్‌ షైర్ హ్యాథవే చైర్మన్ వారెన్ బఫెట్‌ ను మించిపోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీ తాజా నివేదిక ప్రకారం.. జూకర్‌ బర్గ్ సంపద విలువ ప్రస్తుతం 81.6 బిలియన్ డాలర్లుగా ఉండ‌గా...బఫెట్ సంపద 81.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తేలింది. అయితే, అదే జుక‌ర్ ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న వార్త‌తో వార్త‌ల్లో నిలిచారు. అయితే,ఇప్పుడు ఆయ‌న ఆదాయం వ‌ల్ల కాదు..ఇంకొక‌రి ఆదాయం పోగొట్టేలా చేయ‌డం వ‌ల్ల‌! ఔను. ఓ వాటాదారు జుక‌ర్‌ బ‌ర్గ్‌ కు ఈ మేర‌కు నోటీసులు అందించాడు.

ఇటీవ‌ల అంచనాలకు తగ్గట్టు ఆర్థిక ఫలితాలను ప్రకటించకపోవడంతో పాటు భవిష్యత్ గైడెన్స్‌ ను కూడా తగ్గించడంతో ఫేస్ బుక్ షేరు 20 శాతంకు పైగా నష్టపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 130 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. ఇది రూపాయి మారకంలో దాదాపు రూ. 8.92 లక్షల కోట్లకు సమానం. కంపెనీ నిర్వహణ లాభ మార్జిన్లు 44 శాతం నుంచి 30 శాతానికి తగ్గినట్టు ఫేస్‌ బుక్ సీఎఫ్‌ వో డేవిడ్ వెహ్‌నర్ ప్రకటించారు. దీంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ ప్రారంభం అయిన వెంటనే 20 శాతంకు పైగా నష్టపోయింది. గైడెన్స్ తగ్గించడంతో ఇప్పటిదాకా బుల్లిష్ బెట్‌ లు చేసిన అనేక ఫండ్ సంస్థలు డౌన్‌ గ్రేడ్ చేయడం ప్రారంభించాయి. నోమురా బై రేటింగ్ నుంచి న్యూట్రల్‌ కు మార్చింది. రేమాండ్ జేమ్స్ - కెల్లీ సంస్థలు కూడా ఫేస్‌ బుక్ షేరును డౌన్‌ గ్రేడ్ చేశాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఓ వాటాదారు ఫేస్‌ బుక్‌ పై - దాని వ్య‌వ‌స్థాప‌కులు జుక‌ర్‌ బ‌ర్గ్‌ కు నోటీసులు జారీచేశాడు. వాటాదారుల ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీసేలా - అవాంచిత న‌ష్టం క‌లిగించేలా - త‌ప్పుడు ప్ర‌క‌ట‌నలు ఇచ్చి సంస్థ వృద్ధి త‌గ్గేలా చేయ‌డంతో పాటుగా స‌రిగా నిర్వ‌హించలేక‌పోవ‌డం, క్రియాశీల వినియోగ‌దారుల‌ను కోల్పోవ‌డం వంటివి ఫేస్‌ బుక్‌ - జుక‌ర్‌ బ‌ర్గ్ త‌ప్పిదాలుగా ఇందులో పేర్కొన్నారు.