Begin typing your search above and press return to search.

సోషల్ మీడియానే ప్రజలని చంపేస్తోంది .. బైడెన్ ఆగ్రహం !

By:  Tupaki Desk   |   17 July 2021 1:30 PM GMT
సోషల్ మీడియానే ప్రజలని చంపేస్తోంది .. బైడెన్ ఆగ్రహం !
X
అగ్రరాజ్యం అమెరికా అధినేత జో బైడెన్ సోషల్ మీడియా తీరు పై మండిపడ్డారు. సోషల్ మీడియా లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాక్సిన్ల పై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండటం పట్ల జో బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ టీకాల పై ప్రముఖ సామాజిక మాద్యమం ఫేస్ బుక్ లో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పందించాలని అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌లో శుక్రవారం జరిగిన మీడియ సమావేశం సందర్భంగా ఓ విలేకరి అధ్యక్షుడిని అడిగారు.

విలేకరి అడిగిన ప్రశ్నకి ... జో బైడెన్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని కోరారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అంతేగాక, కరోనా వ్యాక్సిన్ వేసుకోనివారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని తెలిపారు. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదన్నారు. యూఎస్ సర్జన్ జనరల్, భారతీయ అమెరికన్ డా. వివేక్ మూర్తి కరోనా వైరస్ వ్యాక్సిన్ల పై తప్పుడు సమాచారం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తర్వాత రోజే బైడెన్ ఇలా సోషల్ మీడియా పై విరుచుకుపడ్డారు.

కరోనా వ్యాక్సిన్ల పై తప్పుడు సమాచారం ప్రచారం కావడంపై వివేక్ మూర్తి గురువారమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆయన ఇన్ఫోడెమిక్ గా తెలిపారు. ఈ సందర్భంగా వైరస్ తన కుటుంబానికి మిగిల్చిన విషాదాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్ , యూఎస్‌ లో కలిపి మొత్తం 10 మంది కుటుంబ సభ్యులను కరోనా మహమ్మారి కారణంగా కోల్పోయినట్లు తెలిపారు. అందుకే కరోనాను తేలికగా తీసుకొవద్దని కోరారు. వ్యాక్సిన్ల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వీలైనంత త్వరగా అందరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. కేవలం టీకాల కారణంగా కరోనా అదుపులోకి వచ్చిందని అన్నారు.

సోషల్ మీడియా వేదికగా వ్యాక్సిన్ల పై అసత్య ప్రచారం జరగడాన్ని ఉపేక్షించబోమన్నారు. వెంటనే సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేనిపక్షంలో తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఫేస్ బుక్ ప్రతినిధి డానీ లీవర్ ఖండించారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నిజానికి ఫేస్ బుక్ లో కరోనా వ్యాక్సిన్ల పై కచ్చితమైన సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారని అన్నారు. వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందనే వివరాలను తెలిపే వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ను 33 లక్షల మంది అమెరికన్లు ఉపయోగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాణాలను కాపాడటంలో ఫేస్ బుక్ ఎంతగానో సహాయపడుతోందని చెప్పడానికి ఈ గణాంకాలే సాక్ష్యమని డానీ లీవర్ వెల్లడించారు.

మానవ శరీరాల్లోకి చొరబడి నక్క జిత్తులతో కణ యంత్రాంగాలను ఏమార్చి, ఇన్‌ ఫెక్షన్‌ ను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ ను అంతే యుక్తిగా బోల్తా కొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవ్తేతలు కనుగొన్నారు. ఇందుకోసం లోపాలతో కూడిన కృత్రిమ కరోనా వైరస్‌ ను తెరపైకి తెచ్చారు. దీనిని ఎలా ఉపయోగిస్తారంటే.. మానవ కణ ఉపరితలానికి అంటుకున్న వైరస్ దగ్గర కృత్రిమ కరోనా వైరస్‌ అతుక్కొని, ఆ తర్వాత జన్యూ పదర్థాన్ని అందులోకి పంపిస్తుంది.

తర్వాత వైరస్ కణ వ్యవస్తను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత తన లాంటి కృత్రిమ కరోనా అనేక ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. ఇలా నిజమైన వైరస్ పై లోపభూయిష్టంగా తయారుచేసిన డిఫెక్టివ్‌ ఇంటర్‌ ఫియరింగ్‌ (డీఐ) వైరస్‌లతో వీటికి చెక్‌ పెట్టొచ్చని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ప్రవేశించిన కణాల్లో అసలైన వైరస్‌ ఉంటే డీఐ వైరస్‌ కూడా పునరుత్పత్తి చేయగలుగుతుంది. ఇందుకోసం అసలైన వైరస్‌ జన్యురాశిలోని పునరుత్పాదక యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఫలితంగా హానికర వైరస్‌ వృద్ధి చెందకుండా అక్కడే ఆగిపోతుంది.