Begin typing your search above and press return to search.

మన మూఢ నమ్మకానికి ఈ బల్లి బలై పోతోంది

By:  Tupaki Desk   |   28 Dec 2019 4:03 AM GMT
మన మూఢ నమ్మకానికి ఈ బల్లి బలై పోతోంది
X
నిజమే... పాకిస్థాన్, భారత్ లాంటి దేశాల ఎడారి ప్రాంతాల్లో లభ్యమయ్యే శాండా బల్లి మనిషి మూఢ నమ్మకానికి బలైపోతోంది. మనిషిలో తగ్గుతున్న మగతనాన్ని మళ్లీ పునరుత్తేజింపజేసే లక్షణముందన్న మూఢ నమ్మకంతో ఈ బల్లిని మనం చంపేస్తున్నామట. మగతనం చచ్చిందా? శాండా బల్లి అయిల్ తో పురషాంగానికి మర్దన చేస్తే సరిపోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం శాండా బల్లి అధికంగా లభించే పాక్ లో చాలా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా ఈ శాండా బల్లి ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సరే... మరి ఈ బల్లి పూర్తి వివరాలు, ఆ జాతే అంతరించిపోతున్న వైనంపై కాస్తంత వివరంగా చెప్పుకుందాం.

సారా హార్డ్ వికీ అనే శాస్త్రీయ నామం కలిగిన శాండా బల్లి భారత్ లోని ఎడారి ప్రాంతంలో కనిపిస్తున్నా... ప్రత్మేకించి మన పొరుగు దేశం పాకిస్థాన్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఎడారి ప్రాంత వాతావరణం లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనం సాగించే ఈ బల్లిపై ఇటీవలి కాలంలో మనిషి దృష్టి పడిందట. ఎందుకంటే... ఈ బల్లి శరీరం నుంచి లభించే కొవ్వు, ఆ కొవ్వు నుంచి తీసే నూనెలో కామోద్దీపన కలిగించే రసాయనాలున్నాయట. అంటే... ఇటీవలి కాలంలో లైంగిక పటుత్వం తగ్గిపోతున్న చాలా మంది పురుష పుంగవులకు ఇది దివ్యౌషధం కిందే లెక్క. వెరసి ఈ తరహా సంఖ్య పురుష పుంగవులు ఏంత మేర పెరుగుతుంటే... అంతమేర శాండా బల్లుల ప్రాణాలకు ముప్పు తప్పదన్న మాట.

లైంగిక పటుత్వం కోసం పరితపిస్తున్న పాక్ పురుష పుంగవులు... శాండా ఆయిల్ కోసం ఎగబడుతున్నారట. ఇంకేముంది... ఈ బల్లి ఆయిల్ విక్రేతల సంఖ్య ఇట్టే పెరిగి పోయింది. అటవీ చట్టాల కింద ఈ బల్లిని చంపితే పెద్ద నేరమే. అదే సమయంలో ఈ బల్లి ఆయిల్ అమ్మినా కూడా నేరమే. అయితే చట్టాలపై అంతగా పట్టింపు లేని పాక్ లొో అటవీ చట్టాలు అమలువుతాయా? కావు కదా. నిజమే.... చట్టాలపై అంతగా పట్టింపు లేని పాక్ లో ఇప్పుడు లైంగిక పటుత్వం కోసం శాండా బల్లులను చంపుతున్న వారి సంఖ్య, వాటి నుంచి ఆయిల్ తీసి విక్రయిస్తున్న వారి సంఖ్య. ఆయిల్ కోసం ఎగబడుతున్న వారి సంఖ్య బాగానే పెరిగిందట. అంతే కాకుండా ఈ తరహా వ్యాపారం ఇప్పుడు పాక్ లో బహిరంగంగానే జరుగుతోందట. శాస్త్రీయం గా శాండా బల్లుల నూనె తో పురుషాంగానికి మర్దనతో లైంగిక పటుత్వం పెరుగుతుందని ఎలాంటి నిరూపణ కాకున్నా కూడా ఈ తరహా ప్రచారంతో ఇప్పుడు శాండా ఆయిల్ వ్యాపారం పాక్ లో ఓ రేంజిలో సాగుతోందట. వెరసి శాండా జాతి అంతరించి పోయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.