Begin typing your search above and press return to search.

మ‌గ‌జాతి వినాశ‌నం మొద‌లైందంట‌!

By:  Tupaki Desk   |   25 Jan 2018 4:33 AM GMT
మ‌గ‌జాతి వినాశ‌నం మొద‌లైందంట‌!
X
మ‌గాళ్ల‌కు ముప్పు మొద‌లైంద‌ట‌. మేం మ‌గాళ్ల‌మంటూ ధీమాగా చెప్పే రోజులు అంత‌కంత‌కూ త‌గ్గిపోయే ప‌రిస్థితి. అంతేనా.. మ‌గ‌జాతికే ముప్పు వాటిల్లే రోజులు ద‌గ్గ‌ర్లోకి వ‌చ్చేసిన‌ట్లుగా తేల్చిన ఒక ప‌రిశోధ‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. షాక్‌కు గురి చేస్తోంది. సృష్టిలో మ‌గ‌.. ఆడ ఇద్ద‌రు స‌మాన‌మే అయినా మ‌గాడి ఆధిప‌త్యం కొన్ని శ‌తాబ్దాలుగా సాగుతూనే ఉంది.

మ‌గ‌పిల్లాడు పుడితే మోము మీద న‌వ్వు వ‌చ్చేయ‌టం.. మ‌గ పిల్లాడు పుడితే వంశాభివృద్ధి అనే మాట‌లు త‌ర్వాత‌.. అస‌లు మ‌గ‌జాతి ఉనికికే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న విష‌యాన్ని తాజాగా గుర్తించారు. అదెలా అంటే.. కాస్త సైన్స్ లోకి వెళ్లాలి.

పుట్టుక‌కు కీల‌క‌మైన క్రోమో జోమ్ ల్లో వై క్రోమోజోమ్ పురుషుల పుట్టుక‌కు కీలం. అయితే.. ఇటీవ‌ల జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో ఈ వై క్రోమోజోమ్ లు క్ర‌మ‌క్ర‌మంగా కుచించుకుపోతున్న వైనం వెల్ల‌డైంది. ప్ర‌తి మ‌నిషికి ప్ర‌తి క‌ణంలోనూ 23 జ‌త‌ల (46) క్రోమోజోములు ఉంటాయి. వాటిల్లో 23 జ‌త‌లు ఆటో జోమ్స్ మిగిలిన ఒక్క జ‌త‌.. ఎక్స్ .. వై క్రోమోజోమును సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు.

త‌ల్లి క‌డుపులో ఉన్న పిండం.. భ‌విష్య‌త్తులో ఆడ అవుతుందా? మ‌గగా మారుతుందా? అని తేల్చేది ఇదే. రెండు ఎక్స్ లు క‌లిస్తే ఆడ‌పిల్ల‌.. ఎక్స్ వై క్రోమోజోములు క‌లిస్తే మ‌గ పిల్లాడు పుడ‌తాడు. అలా మ‌గ పిల్ల‌ల పుట్టుక‌కు కీల‌క‌మైన వై క్రోమోజోములు గ‌తంతో పోలిస్తే.. అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న వైనాన్ని గుర్తించిన‌ట్లు చెబుతున్నారు.

ఎందుకిలా జ‌రుగుతోంద‌న్న‌ది చూస్తే.. ఎప్ప‌టిక‌ప్పుడు జెనెటిక్ రీకాంబినేష‌న్ ఎక్స్ క్రోమోజోన్ల‌కు ఉన్న‌ట్లుగా వై క్రోమోజోము కు లేక‌పోవ‌టంతో ఆ జ‌న్యువులు కుచించుకుపోవ‌టం మొద‌లైంద‌ని.. ఇది ఇప్పుడు గుర్తించేంత‌గా మారింద‌ని చెబుతున్నారు. ఇదే క్ర‌మం కొన‌సాగితే మ‌రో 46 ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల‌కు భూమ్మీద మ‌గాళ్లే లేకుండా పోతార‌ని కెంట్ వ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఈ ఇష్యూలోనూ రెండు వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. ఇందులో ఒక‌రు వై క్రోమోజోమ్ అంత‌రిస్తుంద‌ని వాదిస్తుంటే.. మ‌రికొంద‌రు అంత‌రించ‌ద‌ని చెబుతున్నారు. ఇలా రెండు గ్రూపులుగా విడిపోయిన వారు.. ఎవ‌రి వాద‌న‌ను వారి వినిపిస్తున్నారు. మ‌గాళ్లు భూమ్మీద అంత‌రించిపోవ‌టం ఖాయ‌మ‌నే వారు చెప్పిందే నిజ‌మైతే.. ఆ టైంకు మ‌నిషి ఏదో ర‌కంగా ఈ స‌మ‌స్య‌ను అదిగ‌మించ‌కుండా ఉంటారా? అన్న మాట వినిపిస్తోంది.