Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక ఫలితంపై సర్వేలు చెబుతున్నదేమిటి?

By:  Tupaki Desk   |   17 Nov 2015 4:29 AM GMT
ఉప ఎన్నిక ఫలితంపై సర్వేలు చెబుతున్నదేమిటి?
X
అందరిలోనూ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోన్న వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశం ఒకటి చోటు చేసుకుంటుంది. ఉప ఎన్నిక తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై పలు రాజకీయ పార్టీలతో పాటు.. మీడియా సంస్థలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎవరికి వారుగా సొంత సర్వేలు నిర్వహిస్తున్నారు. తుది ఫలితంపై ఒక అంచనాకు వస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వివిధ పార్టీలు.. పలు మీడియా సంస్థలకు చెందిన సర్వే ఫలితాలు ఒకే విషయాన్ని స్పష్టం చేయటం విశేషంగా చెప్పాలి. సర్వేల రిపోర్టుల అన్నీ తుది ఫలితం తెలంగాణ అధికారపక్షానికి సానుకూలంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఆఫ్ ద రికార్డుగా పార్టీలు.. మీడియా సంస్థకు చెందిన ప్రతినిధులు చెబుతున్న మాట ప్రకారం.. వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షం గెలుపు ఖాయమంటున్నారు. తక్కువలో తక్కువ వేసుకుంటే.. 3.5లక్షల మెజార్టీ ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల మధ్య ఈ మెజార్టీ మరికాస్త తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాల్లో అధికారపక్షం బలంగా ఉందని.. టీఆర్ ఎస్ కు వచ్చే మెజార్టీలో సింహభాగం ఈ రెండుఅసెంబ్లీ నియోజకవర్గాల నుంచే వస్తుందని చెబుతున్నారు. మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింటిలో ఇబ్బందికర పరిస్థితి ఉందని.. అక్కడ మెజార్టీ ఏ మాత్రం వచ్చే అవకాశం ఉందని.. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో మాత్రం ఒక మోస్తరు అధిక్యత వస్తుందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నికల్లో కనిష్ఠంగా 1.5లక్షలు.. గరిష్ఠంగా 3.5లక్షల మేర మెజార్టీ వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని మాత్రం తాజా ఉప ఎన్నికల్లో వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదన్న మాట చెబుతున్నారు. మరి.. ఈ మాటల్లో నిజం ఎంతన్నది తుది ఫలితం వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.