Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ జోస్యం: బీహార్ లో హోరా హోరీనే

By:  Tupaki Desk   |   5 Nov 2015 1:01 PM GMT
ఎగ్జిట్ జోస్యం: బీహార్ లో హోరా హోరీనే
X
బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు హోరాహోరీని త‌ల‌పిస్తున్నాయ‌న్న విష‌యాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఐదు ద‌శ‌ల‌లో జ‌రిగిన పోలింగ్ ప్ర‌క్రియ ఈ రోజు పూర్తి అయ్యింది. పోలింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన వెంట‌నే.. ప‌లు మీడియా సంస్థ‌లు త‌మ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల్ని వెల్ల‌డించాయి. హోరాహోరీగా సాగిన ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్లే.. జేడీయూ మ‌హాకూట‌మికి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి మ‌ధ్యన విజ‌యం దోబూచులాడుతున్న ప‌రిస్థితి. ఎన్డీయేతో పోలిస్తే.. జేడీయూ మ‌హాకూట‌మి కాస్త మెరుగ్గా ఉన్న‌ట్లు ఎగ్జిట్ ఫ‌లితాలు చెబుతున్నాయి. వివిధ మీడియా సంస్థ‌లు పేర్కొన్న ఎగ్జిట్ ఫ‌లితాలు చూస్తే..

మీడియా సంస్థ జేడీయూ మ‌హాకూట‌మి ఎన్డీయే
టైమ్స్ నౌ 122 111
ఇండియా టుడే 120 117
హిందుస్థాన్ టైమ్స్ 117 120
ఇండియా టీవీ 122-132 101-121
న్యూస్ ఎక్స్ 130-140 90-100