Begin typing your search above and press return to search.
గుప్త నిధుల కోసం తవ్వకాలు.. అనుమానాస్పద రీతిలో నలుగురు మృతి !
By: Tupaki Desk | 15 Aug 2020 3:40 PM ISTగుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన నలుగురు అనుమానాస్పద రీతిలో ఒక్కొక్కరు ఒక్కో చోట నురగలు కక్కుకుంటూ మృతి చెందారు. మృతదేహాల వద్ద జుట్టు లేని కొబ్బరికాయలు పడి ఉన్నాయి. అలాగే ఇంటి వెనక ఉన్న ఓ శవం వద్ద వద్ద నిమ్మకాయలు, పువ్వులు ఉన్నాయి. పక్కన తవ్విన ఓ గుంతలో పార ఉంది. మొత్తంగా పూజ సామగ్రి, కొబ్బరికాయలు, తవ్విన గొయ్యి ఆధారంగా గుప్త నిధుల కోసం ప్రయత్నాలు జరిగాయని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా రేపల్లి మండలం నాగాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. బంధువులు చెప్పిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన హజీరాబేగం, రహీం దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు కరీంపాష ఉన్నారు. ఆర్ ఎంపీ వైద్యుడిగా యునానీ మందులు ఇచ్చే రహీం కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. అప్పటికే ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కూతుళ్లు నాగర్ కర్నూలు లో, చిన్నకూతురు హైదరాబాద్ లో ఉంటున్నారు. కుమారుడు కరీంపాష, నాగర్ కర్నూలులోనే ఆర్ ఎంపీగా పనిచేస్తున్నాడు. అయితే, తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ ఆరేళ్ల క్రితం తన కూతుళ్లు, అల్లుళ్లకు హజీరాబేగం చెప్పింది. అయితే ఇంట్లో ఎలాంటి తవ్వకాలు చేపటొద్దని కుటుంబ సభ్యులు, బంధువులు గట్టిగా చెప్పడం తో ఆ ఆలోచనను ఆమె విరమించుకుంది. రెండో కూతురు ఆస్మ, అల్లుడు ఖాజాపాషా మాత్రం నిధులు దొరికితే పేదరికం నుంచి బయటపడి మంచిగా బతకొచ్చని ఆశపడ్డారు.
ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలకు గురువారం ముహూర్తం పెట్టుకున్నారు. బుధవారం భార్య ఆస్మ, కూతురు ఆష్రిన్‌తో కలిసి ఖాజాపాషా నాగర్‌కర్నూలు నుంచి నాగపూర్ లోని అత్తగారి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. శుక్రవారం యూసుఫ్ అనే వారి బంధువు ఇంటికి వెళ్లగా అక్కడ నలుగురూ విగత జీవులుగా కనిపించారు. హాల్లో ఒకరు.. వంటగదిలో ఒకరు.. పడక గదిలో ఒకరు.. ఇంటి వెనకాల ఒకరు ఇలా అంతా వేర్వేరుచోట్ల విగతజీవులుగా కనిపించారు. మృతులను ఖాజాపాష, ఆయన భార్య ఆస్మ, వారి కూతురు ఆష్రిన్, ఆస్మ తల్లి హజీరా బేగంగా గుర్తించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలను రేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించారు. ఆ పోస్టుమార్టం నివేదికలో మృతదేహాల్లో విషం ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే వారు తమకు తామే విషం తీసుకున్నారా .. లేక బలవంతంగా ఎవరైనా తాగించారా అనేది ఫోరెన్సిక్ నివేదికలో తేలుతుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని హజీరాబేగం దంపతులు ఏళ్ల క్రితమే కొన్నారు. అంతకుముందే ఆ ఇంట్లో ఉంటున్నవారిలో ఇద్దరు ప్రమాదాల్లో చనిపోయారు. హజీరా భర్త రహీం ఎలాంటి అనారోగ్యం లేకుండానే అకస్మాత్తుగా చనిపోయాడు. కొన్నాళ్లకు మనుమడు నీటి సంపులో పడి చనిపోయాడు. తాజాగా ఇంట్లో ఉన్న నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ ఇంటి గురించి ఆ ఊరు ప్రజలు , చుట్టూ ప్రక్కల గ్రామాల వారు చర్చించుకుంటున్నారు.