Begin typing your search above and press return to search.
ఆ 'జడ్జి' జైలు నుంచి రిలీజ్ అయ్యారు
By: Tupaki Desk | 21 Dec 2017 10:53 AM ISTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కర్ణన్ గుర్తున్నారా? కోర్టు ధిక్కార నేరం కింద దేశంలో తొలిసారి జైలుశిక్ష అనుభవించిన న్యాయమూర్తిగా ఆయన రికార్డు సృష్టించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సంచలన వ్యాఖ్యలు చేయటం.. అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని చవిచూసిన జస్టిస్ కర్ణన్.. తాజాగా వార్తల్లోకి వచ్చారు.
కోర్టు ధిక్కార నేరం కింద జైలుశిక్ష అనుభవించిన ఆయన తాజాగా రిలీజ్ అయ్యారు.సుప్రీంకోర్టును విమర్శించిన నేరంలో ఆయనకు జైలుశిక్ష విధించారు. కోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సిన వేళ.. ఆయన తప్పించుకుపోవటం.. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు జరిపారు. పోలీసులు అయితే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయన కోసం వెతికారు. ఒకదశలో కొన్ని ప్రాంతాల్లో ఉండిపోయారు కూడా.
మే 9న అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాగా.. జూన్ 20న తమిళనాడులోని కోయంబత్తూరులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనకు వేసిన శిక్ష విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒక దశలో తాను చేసిన పనికి సారీ చెప్పేందుకు సైతం సిద్ధమైనా.. సుప్రీంకోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. జైలుపాలైన తొలి సిట్టింగ్ జడ్జిగా ఆయన రికార్డు సృష్టించారు. చేసిన నేరానికి ఆర్నెల్లు జైలుశిక్ష అనుభవించిన కర్ణన్.. తాజాగా విడుదలయ్యారు.