Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడే ప్రీతిరెడ్డిని చంపాడా.?

By:  Tupaki Desk   |   7 March 2019 4:27 PM IST
మాజీ ప్రియుడే ప్రీతిరెడ్డిని చంపాడా.?
X
ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన వైద్యురాలు ప్రీతిరెడ్డి దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ఆమెను కత్తితో దారుణంగా పొడిచి సూట్ కేసులో కుక్కి ఆమె కారులోనే చంపిన వైనం విషాదం నింపింది.

ప్రీతి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామంగా తేల్చారు. నర్సింహారెడ్డి-సుచిరిత వారి తల్లిదండ్రులు. ఆమె తండ్రి కూడా వైద్యుడే. 1996లో కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో ప్రీతిరెడ్డి స్థిరపడ్డారు. ప్రస్తుతం ప్రీతి బ్లూ మౌంటేన్స్ లోని గ్లేన్ బ్రూక్ డెంటల్ ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేస్తున్నారు.

ఈమె హత్యకు భారత సంతతికే చెందిన డెంటిస్ట్.. ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ నార్డే అని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆమె కనిపించకుండా పోయిన మరునాడే.. సోమవారం హర్షవర్ధన్ అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ట్రక్కును హర్షవర్ధన్ కారుతో ఢీకొట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రీతిని హత్య చేసిన తర్వాత హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రీతి, హర్షవర్ధన్ ఒకే ఆసుపత్రిలో కలిసి పనిచేశారని తెలిసింది. అప్పుడు అయిన పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయినట్టు సమాచారం. ఆ పగతోనే హర్షవర్ధన్ ప్రీతిని హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు తెలిసింది.