Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్‌ కు ఇది సాక్ష్యం కావచ్చు!

By:  Tupaki Desk   |   28 July 2021 2:30 AM GMT
థర్డ్ వేవ్‌ కు ఇది సాక్ష్యం కావచ్చు!
X
కరోనా కంగారుతో ఒక్క దేశమని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు, సమూహాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఏ ముహూర్తాన మహమ్మారి సోకిందో గాని ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. నిన్నా మొన్నటి వరకు సెకండ్ వేవ్ భయానక పరిస్థితులతో మన దేశం కూడా అల్లాడింది. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ భయాల నుంచి కోలుకుని ప్రజలు కాస్త బయట తిరుగుతున్నారు. సెకండ్ వేవ్ మన దేశం చాలా భయానక పరిస్థితులను చవి చూసింది. పేషంట్లను చేర్చుకుందామంటే ఆస్పత్రులలో బెడ్లు లేక, చనిపోయిన వారిని దహనం చేసేందుకు స్మశాన వాటికల్లో స్థలం లేక అనేక మంది అవస్థలు పడ్డారు.

నెల రోజుల పాటు రోజూ లక్షల సంఖ్యలో రోజూ కొత్త కేసులు వెలుగు చూశాయి. కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు నెమ్మదిగా శాంతించాయి. అప్పటికే శాస్త్రవేత్తలు థర్డ్ వేవ్ వస్తుందని హెచ్చరించారు. కానీ ఇది పట్టించుకోకుండా కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనితో మరలా కేసులు పెరుగుతూ పోతున్నాయి. దీనితో ఇప్పటికే చాలా మంది భయపడుతూ బతుకుతున్నారు. గడిచిన వారం రోజులుగా దేశంలో మరలా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం అందరినీ కలవరానికి గురి చేస్తుంది.

ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. శాస్త్రవేత్తలు చెప్పిన థర్డ్ వేవ్ భయం త్వరలోనే వస్తుందని అంతా భయపడుతున్నారు. వారం లోపే కరోనా కేసుల సంఖ్య రెట్టింపయింది. దేశంలో పాజిటివిటీ రేటు 3.4 శాతంగా నమోదు అయింది. గత వారంలో ఈ పాజిటివిటీ రేటు కేవలం 1.68 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఇటువంటి గణాంకాలే దేశ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ కరోనా కేసులు తగ్గే బదులు పెరగడం గమనార్హం.

ఈ పరిస్థితులు కనుక ఇలాగే కొనసాగితే మరలా థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాము ముందే హెచ్చరించినట్లు థర్డ్ వేవ్ రాక తప్పదని సూచిస్తున్నారు. దేశాన్ని అతలాకుతలం చేసిన సెకండ్ వేవ్ సమయంలో చూసుకుంటే పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతం వరకు ఉండేది. దేశంలో ఉధృతంగా కొనసాగిన సెకండ్ వేవ్ మెల్లగా తగ్గిపోయింది.

ప్రస్తుతం అంతా కుదురుకుంటుందనుకున్న తరుణంలో మరలా కేసులు పెరగడం అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. తగ్గినట్టే తగ్గిన పాజిటివిటీ రేటు మరలా పెరుగుతుండడం భయానక పరిస్థితులను చూపెడుతుంది. జూలై 20న 1.68 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవన్నీ థర్డ్ వేవ్ కు సంకేతాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాజిటివిటీ రేటు కాస్త జూలై 25 నాటికి 2.31 శాతంగా నమోదయింది. ఇక ఈ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండడం అందర్నీ భయపెడుతుంది.

ఈ పాజిటివిటీ రేటు కాస్త... జూలై 26 నాటికి 3.4 శాతానికి చేరడం ఆందోళనకరం. దేశ వ్యాప్తంగా ఎక్కువ శాతం జనాభాలో ఇప్పటికే యాంటీ బాడీస్ క్రియేట్‌ అయ్యాయి అంటూ ప్రచారం జరుగుతోంది. కనుక థర్డ్‌ వేవ్‌ వల్ల సెకండ్‌ వేవ్‌ అంత ప్రమాదం ఉండక పోవచ్చు అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.