Begin typing your search above and press return to search.

అంతా కొత్తగానే... మంత్రులకు షాకింగ్...?

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:55 AM GMT
అంతా కొత్తగానే... మంత్రులకు షాకింగ్...?
X
ఏపీలో రాజకీయం ఎపుడూ అనూహ్యంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా వెళ్తారు అని అంటారు. ఇక గతంలో ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగా ఆయన చుట్టూ స్పెషల్ గా ఒక కోటరీ అని ఏదీ ఉండదు, ముఖ్యమంత్రి ఏంచేస్తారన్నది కూడా చివరి నిముషం వరకూ బయటపడదు, దాంతో ఎలాంటి ఊహాగానాలకు తావు ఉండదు, జగన్ మదిలో ఏముందే అదే అమలు అవుతుంది. అందువల్ల ఆయన ఫలానా అని బయటపెట్టేంతవరకూ ఎవరికీ కూడా అది రివీల్ అయ్యే చాన్సే లేదు.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారు అన్న ప్రచారం మళ్లీ మొదలైంది. అది కూడా ఈ ఫిబ్రవరి నెలలోనేనట. మూడవ వారంలో దానికి ముహూర్తం నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఒక వేళ అది కాకపోతే ఈ నెల 22న మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చు అని అంటున్నారు.

ఇపుడు చూస్తే మాఘమాసం నడుస్తోంది. ఉన్నవి అన్నీ కూడా మంచి ముహూర్తాలే. దాంతో బడ్జెట్ సమావేశల కంటే ముందే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. మరో వైపు చూసుకుంటే ఏప్రిల్ 2 నుంచి అంటే ఉగాది మరుసటి రోజు నుంచి ఏపీలొ 26 జిల్లాలతో పరిపాలన మొదలవుతోంది.

దానికి తగినట్లుగా కొత్త మంత్రులను తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారుట. ఈ మేరకు గట్టిగానే కసరత్తు చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాలు ఎటూ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్రెష్ నెస్ పోకుండా కొత్త మంత్రులతోనే పాలన స్టార్ట్ చేస్తే రానున్న రెండేళ్లలో ప్రభుత్వ తీరు మారుతుందని, మరింత జోరు అందుకుంటుందని జగన్ ఆలోచిస్తున్నారుట.

ఇక మంత్రి వర్గ విస్తరణలో ఏఏ ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకుంటారు అన్నదే చర్చగా ఉంది. అయితే జగన్ సామాజిక సమీకరణలను అసలు వదిలిపెట్టరని, వాటి మేరకే కూర్పు ఉంటుందని చెబుతున్నారు. అంటే ఇపుడు ఎవరికి అవకాశాలు వచ్చాయో ఆయా సామాజికవర్గాల నుంచి కొత్త వారికి చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు. అదే విధంగా మంచి నోటి ధాటితో పాటు ప్రభుత్వ సంక్షేమ పధకాలను, అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్ల వారికే అవకాశం ఉంటుంది అంటున్నారు.

అదే విధంగా విపక్షాలు చేసే రాజకీయ విమర్శలు ఎప్పటికపుడు తిప్పికొట్టడానికి సిద్ధగ్నా ఉన్న వారికే చాన్స్ అని కూడా తెలుస్తోంది. ఇక టోటల్ గా మంత్రివర్గాన్ని మారుస్తారా అంటే అవును అనే సమాధానం వస్తోంది. అయితే సీనియర్లు ఒకరిద్దరికి మాత్రం మినహాయింపు ఉంటుంది అంటున్నారు. అలాంటి వారిలో చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కచ్చితంగా ఉంటారట.

ఏది ఏమైనా జగన్ మంత్రి వర్గ విస్తరణ చేస్తారు అన్న ప్రచారంతో ప్రస్తుత మంత్రులకు అది షాకింగ్ న్యూస్ గానే ఉంది అంటున్నారు. చూడాలి మరి ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్నది. ఏది ఏమైనా మరో ఇరవై మంది దాకా కొత్త మంత్రులు జగన్ కొలువులో త్వరలో చేరుతారు అని మాత్రం గట్టిగా చెబుతున్నారు.