Begin typing your search above and press return to search.

అందరూ మాట్లాడతారు.. కేటీఆర్ ఎందుకు నోరు విప్పరు?

By:  Tupaki Desk   |   15 Jun 2021 3:16 AM GMT
అందరూ మాట్లాడతారు.. కేటీఆర్ ఎందుకు నోరు విప్పరు?
X
మాజీ మంత్రి తాజాగా బీజేపీలోకి చేరిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ ను జాగ్రత్తగా కనిపిస్తే.. ఒక ఆసక్తకర అంశం కనిపిస్తుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలు.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి టీఆర్ఎస్ నేతలు పలువురు మాట్లాడటం.. ఆయనపై విరుచుకుపడటం.. శాపనార్థాలు పెట్టటం లాంటివి చేస్తుంటారు. అయితే.. ఈటల ఎపిసోడ్ గురించి ఇప్పటివరకు నోరు విప్పని కీలక నేత ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి కేటీఆర్ మాత్రమేనని చెప్పాలి.

ఈటల ఎపిసోడ్ మొత్తాన్ని గమనిస్తే.. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజేందర్ గురించి పల్లెత్తు మాట కేటీఆర్ నోటి నుంచి రావటం కనిపించదు. అసలు ఆ విషయంతో తనకు సంబంధం లేదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మీడియా సైతం ఈటల అంశంపై స్పందించమని ఆయన్ను అడిగింది లేదు. ఇంతకీ కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు?అన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఈటల వ్యవహారం మీద మౌనంగా ఉన్న వారిలో మంత్రి హరీశ్ కూడా ఒకరు. అయితే.. అదే పనిగా హరీశ్ మీద ఈటల వ్యాఖ్యలు చేయటం.. తనకు మాదిరే హరీశ్ కు అవమానాలెన్నోజరిగాయని ప్రస్తావించటంతో ఆయన కలుగజేసుకొని.. తన ప్రస్తావన ఎందుకు తెస్తారంటూ మండి పడ్డారు. హరీశ్ ప్రస్తావన ఈటల కానీ తేకుంటే..ఆయన కూడా మాట్లాడేవారు కాదని చెబుతారు. తన ప్రస్తావన తేవటం ద్వారా కేసీఆర్ ను ఇరుకున పెట్టాలనుకోవటం సరికాదని.. అందుకే స్పందించినట్లు చెబుతున్నారు.

ఈటల పరమ దుర్మార్గుడు.. అవినీతిపరుడు అని విశ్లేషిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. గతంలో ఇదే ఈటల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడలేదు? అన్నది మరో ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంత్రి కేటీఆర్ కామెంట్ చేయకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. పార్టీలో కీలక నేతగా ఉండి.. మంత్రి ఈటల మీద అన్ని అభాండాలుపడుతున్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా ఆయన మౌనంగా ఉండటం వ్యూహాత్మకమేనని చెబుతున్నారు.