Begin typing your search above and press return to search.

'నా కెప్టెన్సీ ఎలాంటిదో అందరికీ తెలుసు’ రోహిత్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:20 AM IST
నా కెప్టెన్సీ ఎలాంటిదో అందరికీ తెలుసు’  రోహిత్ వ్యాఖ్యలు
X
ఫిట్​నెస్​ నెపంతో ఆస్ట్రేలియా టూర్​కు రోహిత్​ను ఎంపికచేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ తర్వాత రోహిత్​కు మద్దతుగా సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్​ నడిచింది. ఫిట్​నెస్​ లేదంటూ బీసీసీఐ రోహిత్​ను పక్కనపెట్టింది. ఆ తర్వాత అతడు స్టేడియంలో ప్రాక్టీస్​ చేస్తూ కనిపించాడు. మరోవైపు ఐపీఎల్​ 2020లో ముంబై ఇండియన్స్​ తరఫున ఆడాడు. పైగా ముంబై ఇండియన్స్​ చాంపియన్​గా నిలిచింది. దీంతో రోహిత్​ ఫిట్​గా లేకపోతే ఐపీఎల్​ ఎలా ఆడారంటూ పలువురు నెటిజన్లు, సీనియర్​ క్రికెటర్లు కూడా స్పందించారు.

ప్రస్తుతం రోహిత్​ బెంగళూరులోని నేషనల్​ క్రికెట్​ అకాడమీలో ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ ముంబై ఇండియన్స్​ చాంపియన్​గా నిలవడంపై స్పందించాడు. తన కెప్టెన్సీపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘ముంబై ఇండియన్స్‌ ఐదోసారి విజేతగా నిలవడం సాధారణ విషయం కాదు. అందుకు ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కలేదు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టాం. కెప్టెన్సీ వ్యవహరంపై జరుగుతున్న రచ్చపై రోహిత్​ స్పందించారు.

ముంబై ఇండియన్స్​ జట్టును ఎంతో ప్లాన్​తో రూపొందించుకున్నాం. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్‌ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కూడా ఆడాడు కదా. మనసుకు సరైంది చేయడమే నా ముందున్న లక్ష్యం. కెప్టెన్సీని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎలా కెప్టెన్సీ చేస్తానో అందరికీ తెలుసు’ అంటూ రోహిత్​ వ్యాఖ్యానించాడు.