Begin typing your search above and press return to search.

తిరుపతి మీదే ఎందుకింత దృష్టి ?

By:  Tupaki Desk   |   18 April 2021 8:30 AM GMT
తిరుపతి మీదే ఎందుకింత దృష్టి ?
X
భారీ ఎత్తున దొంగఓట్లు పడ్డాయని, దొంగఓట్లకు ప్రయత్నించారని తెలుగుదేశంపార్టీ, బీజేపీలు నానా గోల చేస్తున్నాయి. పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కేవలం తిరుపతి మీద మాత్రమే ఎందుకింతగా దృష్టి పెట్టినట్లు ? ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే తిరుపతిలో మాత్రమే రెండుపార్టీలకు కాస్త పట్టుంది.

తెలుగుదేశంపార్టీ విషయం తీసుకుంటే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే మెజారిటి వచ్చింది. తమ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 3580 ఓట్లు వైసీపీ అభ్యర్ధికన్నా ఎక్కువచ్చాయి. పనబాకది అవటానికి నెల్లూరూ జిల్లానే అయినా ఆ జిల్లాలోని నాలుగు అసెంబ్లీల్లో ఎక్కడా మెజారిటి రాలేదు. అంటే అంతో ఇంతో టీడీపీకి తిరుపతిలోనే పట్టుందన్న విషయం అర్ధమవుతోంది. ఈ కారణంగానే మొదటినుండి చంద్రబాబు అండ్ కో తిరుపతి మీద మాత్రమే దృష్టిని ఎక్కువ కేంద్రీకరించారు.

పోలింగ్ మొదలైన దగ్గర నుండి వైసీపీ దొంగఓట్లు వేయించుకుంటోందంటూ నానా గోల మొదలుపెట్టేశారు. నిజానికి దొంగ ఓట్లు వేస్తుండగా పట్టుబడిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎక్కడో కల్యాణమండపంలో ఉన్నారనో, బస్సుల్లో తిరుగుతున్నారనో టీడీపీ గోల చేసింది. ఓట్లేయటానికి పోలింగ్ కేంద్రాల దగ్గర లైన్లలో ఉన్నపుడు పట్టుకుంటేనే దొంగ ఓట్లేయటానికి వచ్చారా లేదా అన్నది తేలుతుంది. కానీ దీనికి భిన్నంగా టీడీపీ నేతలు రచ్చ చేశారు.

టీడీపీ నేతల వ్యవహారం ఎలాగుందంటే దొంగఓట్లన్నది ఈ పార్లమెంటు ఉపఎన్నికతోనే మొదలైనట్లు చెబుతున్నారు. తిరుపతి, నంద్యాల అసెంబ్లీల్లో తాము ఓట్లను ఎలా వేయించుకున్నామనే విషయాన్ని చంద్రబాబు అండ్ కో మరచిపోయినట్లున్నారు. ఇక బీజేపీ విషయం తీసుకుంటే కొన్నిచోట్ల ఓటింగ్ లైన్లలో నిలబడిన వాళ్ళని పట్టుకున్నది నిజం.

అయితే ఎక్కడో ఓ పోలింగ్ కేంద్రంలో పదిమందిని పట్టుకుని మొత్తం పోలింగ్ అంతా దొంగఓట్లతోనే జరిగిందని చెప్పటం కూడా తప్పే. మొత్తానికి కమలనాదులు కూడా తిరుపతిలోనే ఎందుకింతగా గోల చేశారంటే వీళ్ళకు పదిఓట్లు వస్తే ఇక్కడ మాత్రమే రావాలి కాబట్టి. మరి బాగా తగ్గిపోయిన ఓటింగ్ శాతంలో ఎవరు దెబ్బతింటారనే విషయం మే 2వ తేదీన కానీ తేలదు.