Begin typing your search above and press return to search.

ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రంకోసమే : మంత్రి కేటీఆర్

By:  Tupaki Desk   |   27 Sept 2021 4:00 PM IST
ఖర్చు చేసే ప్రతీ రూపాయి  రాష్ట్రంకోసమే : మంత్రి కేటీఆర్
X
హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి కేటీఆర్. రోడ్ల అభివృద్దికి 5వేల 9వందల కోట్ల రుణం తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ రోడ్ల అభివృద్ధిపై అసెంబ్లీలో స్వల్ప చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేపట్టిన ప్రణాళికా బద్దంగా చేపడుతుందన్నారు. మూడేళ్ల పాటు ట్రాఫిక్‌ పై చర్చించిన తర్వాతనే ఎస్‌ ఆర్‌ డీపీని అమలు చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్‌లో మోతాదుకు మించి ఉన్న వాహనాలతో ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా మారిందన్నారు. మొదటి దశ ఎస్‌ ఆర్‌ డీపీలో 2వేల కోట్లతో 22 ఫ్లైఓవర్లను పూర్తి చేశామని తెలిపారు. గ్రేటర్‌ శివారు ప్రాంతలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఒక్క ఎల్‌ బీ నగర్‌ లోనే 850 కోట్లతో నాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనన్న మంత్రి.. హైదరాబాద్‌ లోని ప్రతి లొకేషన్‌ కి ఫ్లైఓవర్‌-లింక్‌ రోడ్‌ తో అనుసంధానం ఉందన్నారు.

చార్మినార్‌, సౌత్‌ జోన్ల పరిధిల్లో 1545కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్‌. పాత బస్తీలో త్వరలోనే పై వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు పెట్టుబడిగానే చూడాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తు చేశారు. భవిష్యత్‌ లో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని వివరించారు. ఎస్‌ ఆర్‌డీపీ రెండో దశ ప్రణాళికలు పూర్తయ్యాయని తెలిపారు.

తెలంగాణ యొక్క పారివ్రామిక పురోగ‌తి రెండు మాట‌ల్లో చెప్పాలంటే.. ట్రాక్ట‌ర్ నుంచి హెలికాప్ట‌ర్ దాకా, ఎర్ర‌బ‌స్సు నుంచి ఎల‌క్ట్రిక్ బ‌స్సు దాకా, ఎల‌క్ట్రిక్ బ‌స్సు నుంచి ఎయిర్ బ‌స్ దాకా, టైల్స్ నుంచి టెక్స్‌టైల్స్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్ దాకా, ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు గ‌మ్య‌స్థానం తెలంగాణే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ మాట తాను అనాలోచితంగా చెప్ప‌డం లేదు. ఇది జ‌రుగుతున్న చ‌రిత్ర‌. న‌డుస్తున్న చ‌రిత్ర ఇది అని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ కార్య‌దక్ష‌త‌కు ఇది నిద‌ర్శ‌నం. స‌మ‌ర్థ‌మైన నాయ‌క‌త్వం, సుస్థిర‌మైన ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌స్తాయ‌న్నారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌తి రంగంలో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి జ‌రుగుతోంది. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్ర‌భాగాన ఉంది. తెలంగాణ రాష్ట్రం 14 ప్రాధాన్య‌త రంగాలను ఎంచుకుంది. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటిక‌ల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాల‌ను ఎంచుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఫార్మా క్ల‌స్ట‌ర్‌గా ముచ్చ‌ర్ల అవ‌త‌రించ‌బోతోంది అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌రిశ్ర‌మ‌లు ఒకే చోట ఉంటే ఉత్ప‌త్తి ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 23 వేల ఎక‌రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తే.. టీఎస్ఐఐసీ ఏర్పాట‌య్యాక ఆరేండ్ల‌లో 19 వేల‌కు పైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామ‌న్నారు.