Begin typing your search above and press return to search.

ప్రతి కలకూ ఓ లెక్కుంది.. నగ్నంగా పడుకున్నట్టు కలగన్నారా? దాని అర్థం ఇదే

By:  Tupaki Desk   |   4 Oct 2020 3:20 PM IST
ప్రతి కలకూ  ఓ లెక్కుంది..  నగ్నంగా పడుకున్నట్టు కలగన్నారా? దాని అర్థం ఇదే
X
రాత్రి పడుకున్నాకా.. కలలు కనేవారు కొందరు.. పగటి కలల్లో మునిగి పోయేవారు మరికొందరు. మేల్కొని ఉండే కలలు గనే సోమరిపోతులూ ఉన్నారు. అయితే ప్రతి కలకు ఓ లెక్కుంటుందట. సాధారణంగా తెల్లవారుజామున పడే కలలు నిజమవుతుంటాయని పెద్దలు చెబుతుంటారు. కలల వాటి ప్రభావాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అయితే మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాల్లోనూ కలల గురించి ఎన్నో కథలు ఉన్నాయి. మన తెలుగు సినిమాల్లోనూ కలల ప్రభావం ఉంటుంది. అయితే ఎటువంటి కలలు వస్తే ఏ ప్రభావం ఉంటుంది. ఈ విషయంపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

ఎవరైనా చనిపోయినట్టు కలోచ్చిందా?

మనకు ప్రియమైన వ్యక్తులు, లేదా శత్రువులు చనిపోయినట్టు ఒక్కోసారి మనకు కలలు వస్తుంటాయి. అయితే ఇటువంటి కలల ప్రభావంతో మనకు తట్టుకోలేనంత కోపం వస్తుందట. అంటే ఈ కల వచ్చిన మరుసటి రోజు నుంచి మనం చీటికి మాటికి కోపం తెచ్చుకుంటూ ఉంటామన్నమాట.

కుక్కలు వెంటాడినట్టు కలలు వస్తుంటే మీకు త్వరలోనే ఉద్యోగం ఊడబోతున్నట్టు సంకేతం. నిరుద్యోగం, నిస్సహాయత, తీవ్రమైన అప్పులు, ఆందోళన ఉన్నవారికి ఇటువంటి కలలు వస్తాయట. తీవ్రమైన వర్షం, తుఫాను, వరద వస్తున్నట్టు మీరు కలగంటే త్వరలోనే మీరు ఏదో ప్రమాదంలో కూరుకుపోయినట్టు అర్థమట. మీరు చాలా తెలివైన వారని ఎవరన్నా పొగుడుతున్నారని మీరు కల గన్నట్టయితే జీవితంలో పొరపాట్లు చేస్తున్నారని అర్థం. కారు ప్రమాదం జరిగినట్టు కల వచ్చిందటే మీ భార్య లేదా స్నేహితురాలు ఏదో బాధలో ఉన్నారని అర్థం. మీరు నగ్నంగా పడుకున్నట్టు కల గన్నారంటే.. మీలో కోరికలు ఎక్కువతున్నట్టు అర్థం. మీరు ఓ భాగస్వామి కోసం, తోడు కోసం వెంపర్లాడుతున్నట్టు ఇది సంకేతాన్ని ఇస్తుందట.