Begin typing your search above and press return to search.

ఎవరెస్ట్ కి తాకిన కరోనా దెబ్బ ..ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   14 March 2020 5:40 AM GMT
ఎవరెస్ట్ కి తాకిన కరోనా దెబ్బ ..ఏమైందంటే ?
X
కరోనా వైరస్ దాదాపుగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఈ వైరస్ దెబ్బకి అగ్రరాజ్యం అమెరికా కూడా గజగజ వణికిపోతోంది. ఈ కరోనా భారిన పడి ఇప్పటివరకు 5423 మంది మృత్యవాత పడ్డారు. అలాగే సుమారుగా లక్షా 40 వేలమంది ఈ కరోనా తో భాదపడుతున్నారు. చైనా లో ఈ వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ ..మిగిలిన దేశాలలో రోజురోజుకి ఈ తీవ్రత పెరిగిపోతుంది. ఇక భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 82 కి చేరింది. అలాగే భారత్ లో కరోనా సోకడం తో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. దీనితో అన్ని రాష్ట్రాలని కేంద్రం అలర్ట్ చేసింది. ఈ కరోనా ప్రభావం పడని రంగం అంటూ లేదు.

తాజాగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నేపాల్‌ లోని ఎవ‌రెస్ట్ శిఖ‌రంపైనా ప‌డింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎక్కేందుకు వచ్చే పర్వతారోహులకి షాక్ ఇచ్చింది. WHO కరోనాను మహమ్మారిగా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాలు జాగ్రత్తలు పెంచేశాయి. ఈ క్రమంలోనే ఎవరెస్ట్ ఎక్కకూడదనే ఆంక్షలు పెడుతూ.. ఈ ఆర్డర్స్ వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. ఏప్రిల్ చివరి వరకూ ఇదే షరతులు వర్తిస్తాయి అని నేపాల్ టూరిజం సెక్రటరీ కేదర్ బహదూర్ అధికారి చెప్పారు.

కాగా, ఇప్పటికే చైనా ఆధీన ప్రాంతం నుంచి ఎవ‌రెస్ట్‌ ను అధిరోహించే ప‌ర్వ‌తారోహ‌కుల‌కు ఇప్ప‌టికే అనుమ‌తి ఇవ్వ‌డంలేదు. అయితే, ఎవరెస్ట్ ఎక్కడానికి ఇదే కరెక్ట్ సీజన్. ఈ అనుమతులు తీసుకునేందుకు దాదాపు 11వేల డాలర్ల వరకూ ఖర్చు అవుతాయి. అదే సమయంలో కరోనా భయం పొంచి ఉండటంతో నో ఎంట్రీ చెప్పక తప్పలేదు. ఒకవేల ఎవరైనా కరోనా ఉందని తెలియక , పర్వతం పైకి ఎక్కడానికి వస్తే ..పర్వతం ఎక్కే కొలదీ శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. దీనితో నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సాధార‌ణంగా అమెరికా, ఇండియా, చైనా, బ్రిట‌న్‌, జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా దేశాల నుంచి ఎక్కువగా ఎవరెస్ట్ ని ఎక్కడానికి ఎక్కువ మంది వస్తుంటారు.