Begin typing your search above and press return to search.

ఐస్ సునామీ ... మీరెప్పుడైనా చూసారా ?

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:23 AM GMT
ఐస్ సునామీ ... మీరెప్పుడైనా చూసారా ?
X
ప్రకృతి లోని అత్యంత వినాశకరమైన, అత్యంత బలమైన శక్తులు భూకంపాలు. ఎందుకంటే ఒక తీవ్ర భూకంపం కలిగినప్పుడు వెలువడే శక్తి తొలి ఆటంబాంబు వల్ల ఉత్పన్నమైనదాని కన్నా 10,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. దీనికి తోడు మరింత భయ పెట్టే వాస్తవమేమిటంటే, భూకంపాలు ఏ వాతావరణంలో నైనా, ఏ కాలంలో నైనా, రోజులోని ఏ సమయంలోనైనా సంభవించగలవు. శక్తివంతమైన ప్రకంపనలు ఎక్కడ సంభవించగలవనే దాని గురించి శాస్త్రవేత్తలకి కొంత అవగాహన ఉన్నప్పటికీ, అవి ఎప్పుడు సంభవిస్తాయనేది మాత్రం వారు ఖచ్చితం గా మాత్రం చెప్పలేరు. 2004 డిసెంబర్ 26 న సాయంత్రం హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆ భూకంపం తాకిడికి సునామి వచ్చింది. ఈ సునామి కారణంగా ప్రపంచంలోని 9 దేశాలు చాలావరకు దెబ్బ తిన్నాయి.

అయితే, రష్యా లో ఇలాంటి సునామిలు కామన్ గా వస్తుంటాయి. భూకంప తీవ్రతను బట్టీ, అలల ఎత్తు, వేగం ఆధారపడి ఉంటుంది. అయితే, సముద్రంలో మంచు ముక్కలు, మంచు పర్వతాలు లేకపోతే, అలలు నీటి రూపంలోనే సునామీలా ఎగసిపడతాయి. అదే మంచు కొండలు, పర్వతాలు ఉన్నచోట, సముద్రం పై మంచు తేలుతున్న ప్రదేశాల్లో సునామీ వస్తే, ఆ సమయంలో అప్పుడు అలల బదులు మంచు గడ్డలు సునామీ లా ఎగసి పడతాయి. ఇలాంటి ఓ అరుదైన సందర్భం... రష్యాలోని దుడింకాలో ఏర్పడింది. జూన్ 4, 2019న వచ్చిన ఈ సునామి వలన సముద్రం లోని మంచు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీనిని అక్కడి స్థానికులు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ప్రస్తుతం వైరల్ గా మారాయి.