Begin typing your search above and press return to search.

మోడీ కూడానట : ఇంకేమంటాం చెప్పండి...?

By:  Tupaki Desk   |   23 May 2022 11:30 PM GMT
మోడీ కూడానట : ఇంకేమంటాం చెప్పండి...?
X
ఒక వైపు పొరుగున ఉన్న శ్రీలంకలో ఆర్ధిక అరాచకం భారత్ ని తీవ్రంగా భయపెడుతోంది. అతి పెద్ద దేశం ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా తట్టుకోవడం కష్టమే అన్నది నిపుణుల మాట. ఇక దేశంలోని అనేక‌ రాష్ట్రాలు చూసుకున్నా అదే కధ. ఇంతకీ ఆ కధ ఏంటి అంటే అప్పు చేసి పప్పు కూడు తినడం.

ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకదానితో మరోటి పోటీ పడుతూంటే మోడీ మాస్టార్ కూడా నేను కూడా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజుకు ఉన్న అప్ప్పు చూస్తే గుండె బేజారు అవుతుంది అంటున్నరు. 130 లక్షల కోట్ల అప్పు కేంద్రానికి ఉందని, అందులో ఎనిమిదేళ్ళ మోడీ ఏలుబడిలో చేసినదే ఎక్కువ అని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఏడాది కనీసంగా ఆరు నుంచి ఎనిమిది లక్షలకు తక్కువ కాకుండా కేంద్రం అప్పులు చేస్తోంది అని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. దాంతో కేంద్ర ఖజానా మీద భారం ఏకంగా లక్ష కోట్ల మేర పడిందని అంటున్నారు.

దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక కేంద్రం తాజాగా భారతదేశ అవసరాలను తీర్చడానికి 13 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకోవాలని చూస్తోందని అంటున్నారు. అంటే ఇప్పటికి అప్పులకు ఇవి అదనం. మరి ఫ్యూచర్ లో మరెన్ని అప్పులు తెస్తారో చూడాలి. ఇక పొరుగున ఉన్న తెలంగాణా సర్కార్ అప్పులతోనే కధ నడుపుతోంది. అక్కడ కూడా ఉద్యోగులకు జీతాలు పది పన్నెండు తేదీలు దాటిపోతున్నాయి. అయినా కేసీయార్ కి భయపడి అక్కడ మీడియా రాయడంలేదు అంటున్నారు.

సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణా లక్షల కోట్ల అప్పులలో ఉండడం ఆశ్చర్యమే అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే సేమ్ డిటో గానే సీన్ ఉంది. జగన్ సర్కార్ అప్పులతోనే కధ నడుపుతోంది. ఇప్పుడు చెప్పండి అప్పు లేని కధ ఎక్కడ ఉందో అంటున్నారు అంతా.

మోడీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా అప్పులతోనే పబ్బం గడుపుకుంటున్న వేళ ఈ అప్పులన్నిటి మీద అంతా కలసి నిజాయతీతో కూడిన విమర్శలు చేయాలని అంటున్నారు. ఈ అప్పులు దేశానికి ఎంత వరకూ పనికి వచ్చేవి అన్న ప్రశ్న కూడా లేవదీయాలని అంటున్నారు. మొత్తానికి దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలతో పాటు పెద్దన్న కేంద్రం కధ కూడా అప్పులే. ఇప్పుడు ఏం చేద్దాం అన్నదే సగటు జనాలలొ ఉదయిస్తున్న అతి పెద్ద ప్రశ్న.