Begin typing your search above and press return to search.

ఆ సమయంలో కూతుర్లకు కూడా ఉద్యోగం ఇవ్వొచ్చు !

By:  Tupaki Desk   |   15 Jan 2021 9:00 PM IST
ఆ సమయంలో కూతుర్లకు కూడా ఉద్యోగం ఇవ్వొచ్చు !
X
అలహాబాద్ హై కోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో పెళ్లైన కూతురిని కూడా సభ్యురాలిగానే చూడాలని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. కుమారుడికి పెళ్లైనా కుటుంబ సభ్యుడిగానే పరిగణిస్తారు. అతడు అన్నింటికి అర్హుడే. మరి కుమార్తెను ఎందుకు వేరుగా చూడాలని అభిప్రాయపడింది. పెళ్లైన కూతురిని ఏదైనా అభ్యర్థిత్వానికి అనర్హురాలిగా గుర్తించడం వివక్ష కిందకే వస్తుందని తెలిపింది. పెళ్లైన కూతురు కారుణ్య నియామకాలకు అనర్హురాలని పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెళ్లడించింది.

ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లైన కూతురిని కుటుంబంలో సభ్యురాలిగా భావించరాదంటూ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆర్డర్‌ ను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేజే మునిర్ ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. ఇంట్లో కొడుకుకు పెళ్లైనప్పటికీ కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. అతడు అన్నింటికీ అర్హుడే. మరి కూతురు విషయంలో ఎందుకు వేరుగా చూడాలనుకుంటున్నారు. పెళ్లైన కూతురు ఏదేని అభ్యర్థిత్వానికి అనర్హురాలుగా గుర్తించడం వివక్ష కిందకే వస్తుంది అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

విమ్ల శ్రీవాస్తవ కేసులో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. కారుణ్య నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలే పెళ్లైన కూతురికి కూడా ఉంటాయని, పెళ్లైన కూతురు కారుణ్య నియామకాలకు అనర్హురాలనడం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి ఆస్తిలో కూతురి హక్కులపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పులివ్వగా, ఇప్పుడు హైకోర్టు కారుణ్య నియామకాలపై కీలక ఆదేశాలివ్వడం గమనార్హం.