Begin typing your search above and press return to search.
మహమ్మారి మళ్లీ పంజా.. స్పెయిన్ లో కర్ఫ్యూ
By: Tupaki Desk | 26 Oct 2020 12:45 PM ISTకరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నివారణ చర్యలు చేపట్టాయి. చాలా దేశాల్లో మళ్ళీ లాక్ డౌన్ లు ప్రకటించడంతోపాటు ఆంక్షలు విధిస్తున్నారు. ఐరోపా దేశాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఇటలీలో నవంబర్ 24 నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి గియుసేప్ ఆదేశాలు జారీ చేశారు. జిమ్ములు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని ఆదేశాలిచ్చారు. మాస్కుల ధారణ తప్పనిసరి చేశారు. ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసింది. వివాహాలు, రిసెప్షన్లను ఇతర వేడుకలను నిషేధించింది.
కంపానియాలో కర్ప్యూ విధించడంపై నిరాశ వ్యక్తం అవుతోంది. అక్కడ వందలాది మంది యువత ఈ విషయమై ఏకంగా పోలీసులతో గొడవ పడ్డారు. స్పెయిన్ లో కూడా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరగడంతో దేశంలో ఆదివారం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారితో ఇప్పటికే దెబ్బ తిన్న స్పెయిన్, ఇటలీ దేశాలు మరోసారి కేసుల సంఖ్య అధికమవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మహమ్మారి వ్యాప్తితో కొన్ని దేశాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ 8.2 మిలియన్ల మంది కోవిడ్ బారిన పడగా దాదాపు 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.