Begin typing your search above and press return to search.

భారత్ హెచ్చరికలకు దిగొచ్చిన యూరప్ దేశాలు

By:  Tupaki Desk   |   1 July 2021 1:30 PM GMT
భారత్ హెచ్చరికలకు దిగొచ్చిన యూరప్ దేశాలు
X
భారతదేశం దెబ్బకు యూరోపియన్ యూనియన్ దేశాలు దిగొచ్చాయి. భారత వ్యాక్సిన్లు వేసుకున్న ప్రయాణికులను అనుమతించమని మొండికేసిన యూరప్ దేశాల ప్రభుత్వాలకు భారత్ షాక్ ఇచ్చింది. అలా అయితే యూరప్ దేశాల వాసులను కూడా ఇండియాలో అనుమతించమని గట్టి క్వారంటైన్ విధిస్తామని హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన యూరప్ దేశాలు భారత్ ‘కోవిషీల్డ్’ టీకా వేసుకున్న వారికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

స్వయంగా ఈయూలోని బ్రిటన్ తయారు చేసిన కోవీషీల్డ్ టీకా వేసుకున్నా సరే వాటిని ఆమోదించకుండా యూరప్ లోకి ఎంట్రీ నిషేధాజ్ఞలు పెడుతున్న యురోపియన్ దేశాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ లో కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేసుకున్న వారిని అనుమతించాలని లేదంటే యూరప్ దేశాల వారిని తాము కూడా అనుమతించమని.. క్వారంటైన్ చేస్తామని హెచ్చరించింది.

దీంతో తాజాగా కోవిషీల్డ్ టీకాను గుర్తిస్తున్నట్టు ఏకంగా 8 ఈయూ దేశాలు తాజాగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్ తోపాటు ఈయూ దేశాలైన ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్ ల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్, ఎస్టోనియా దేశాల ప్రభుత్వాలు కోవీషీల్ట్ టీకాను అనుమతిస్తున్నామంటూ తాజాగా ప్రకటించాయి.

కరోనా నేపథ్యంలో టీకా తీసుకున్న విదేశీ ప్రయాణికులనే ఐరోపా దేశాల్లోకి అనుమతించేందుకు వీలుగా ఐరోపా సమాఖ్య గ్రీన్ పాస్ ( టీకా పాస్ పోర్ట్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ కేవలం 4 కరోనా టీకాలను మాత్రమే ఆమోదింత జాబితాలో చేర్చింది. అమెరికా తయారు చేసిన ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు తీసుకున్న వారికి మాత్రమే గ్రీన్ పాస్ జారీ చేస్తామని తెలిపింది. భారత్ లో తయారైన కోవిషీల్డ్ తీసుకున్న వారికి ఈ పాస్ రాదన్న ఆందోళనలు బయలు దేరాయి.

దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భారత్ లో తయారైన టీకాలను గుర్తించాల్సిందేనంటూ ఈయూ దేశాలకు తేల్చిచెప్పింది. లేని పక్షంలో భారత్ కు వచ్చే ఈయూ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పవు అని ఖారఖండీగా బదులిచ్చింది. భారత ఒత్తిడికి 9 ఈయూ దేశాలు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవీషీల్డ్ ను గుర్తిస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి.

ఐరోపా సమాఖ్య నిబంధనల ప్రకారం భారత్ లో తయారైన కోవీషీల్డ్, కోవాగ్జిన్ లకు ఈఎంఏ గుర్తింపు లేదు. ఈ టీకాలు తీసుకున్న భారతీయులు యూరప్ దేశాలకు వెళ్లడానికి వీల్లేకుండా అయ్యింది. ఇది భారతీయులకు తలనొప్పిగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దింది. ఏకంగా యూరప్ దేశాలనే హెచ్చరించేలా వ్యవహరించి షాక్ ఇవ్వడంతో ఆ దేశాలు దిగివచ్చాయి.