Begin typing your search above and press return to search.

ఏపీకి ఎతిహాద్ విమానాలు వచ్చేస్తున్నాయ్

By:  Tupaki Desk   |   28 Jun 2016 5:29 AM GMT
ఏపీకి ఎతిహాద్ విమానాలు వచ్చేస్తున్నాయ్
X
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఒకటి ఏపీకి రానుంది. విదేశీ రూట్లలో సర్వీసులు నిర్వహించే ప్రముఖ విమానయాన సంస్థ ఎతిహాద్ ఏపీ నుంచి సర్వీసులు నిర్వహించేందుకు ఓకే చేసింది. తన విదేశీ పర్యటనలో భాగంగా ఎతిహాద్ ఎయిర్ వేస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పొన్నుసామితో భేటీ అయ్యారు. ఈ సంద్భంగా ఏపీలోని పరిస్థితులు.. అవసరాల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటం.. దీనికి తగ్గట్లుగా ఎతిహాద్ సానుకూలంగా స్పందించింది.

అతి త్వరలోనే ఏపీలోని విశాఖపట్నం.. విజయవాడ.. తిరుపతి నుంచి ఫారిన్ కు వెళ్లేందుకు వీలుగా విమానసర్వీసుల్ని తాము నడిపేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎతిహాద్ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో.. రానున్న కొద్దిరోజుల్లోనే విదేశాలకు ఏపీ నుంచి నేరుగా వెళ్లే సౌకర్యం ఆంధ్రప్రదేశ్ వాసులకు లభించనుంది.విభజన జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికి విదేశీ ప్రయాణాల కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. మరికొద్ది రోజుల్లో ఇది కాస్తా మారనుంది. ఏపీ వాసులకిదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి.