ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఈటల!

Mon May 03 2021 17:00:02 GMT+0530 (IST)

etela surrendered to the government

రెండు రోజుల క్రితం వరకూ మంత్రిగా తన విధుల్లో తలమునకలై ఉన్నారు ఈటల రాజేందర్. కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా కొన్ని గంటల్లోనే ఆయన మాజీ మంత్రి అయిపోయారు. సిద్ధిపేట జిల్లాలోని మూసాయిపేట మండలంలో అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారని ఈటలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంతో.. కబ్జా నిజమేనని అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో.. ఈటలపై వేగంగా యాక్షన్ తీసుకున్నారు సీఎం. తొలుత వైద్య ఆరోగ్య శాఖను తన వశం చేసుకున్న ముఖ్యమంత్రి.. ఆ తర్వాత ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు ఈటల కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

మంత్రి పదవి రాద్దు కావడంతో ప్రభుత్వం తనకు కేటాయించిన కాన్వాయ్ ను సరెండర్ చేశారు ఈటల రాజేందర్. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు కాన్వాయ్ ను సైతం సర్కారుకు అప్పగించారు. ఎమ్మెల్యే కోటాలో ఇచ్చిన గన్ మెన్లు మాత్రమే ఆయన వెంట ఉన్నారు.