Begin typing your search above and press return to search.

ఈటల పయనం ఎటు అంటే? ఏమన్నాడంటే?

By:  Tupaki Desk   |   1 May 2021 7:30 AM GMT
ఈటల పయనం ఎటు అంటే? ఏమన్నాడంటే?
X
భూకబ్జా ఆరోపణలతో తనపై విచారణకు ఆదేశించిన కేసీఆర్ సర్కార్ తీరుపై ఆవేదనకు గురయ్యారు మంత్రి ఈటల రాజేందర్. టీఆర్ఎస్ తో తన ఇన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత.. ఇంత అనుబంధం తర్వాత మానవ సంబంధాలు మంటగలిపే పద్ధతిలో .. రాజకీయాల్లో కర్కశత్వం తప్ప వేరొకటి లేదని తన సంఘటనతో నిరూపితమైందని మంత్రి ఈటల రాజేందర్ భావోద్వేగానికి గురి అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రగతి భవన్ లోకి మంత్రి ఈటల రాజేందర్ కు ఎంట్రీ లేదన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నాకే కాదు ఏ మంత్రి అయినా అపాయింట్ మెంట్ తీసుకొనే రావాలని.. తనకు ఒక్కడికే కాదు.. చాలా మంత్రులు వెళ్లడం లేదని ఈటల దాటవేశారు.

ఇక బీజేపీలోకి వెళ్తారా? కొత్త పార్టీ పెడుతున్నాననే ఆరోపణలతోనే కేసీఆర్ ఇలా దూరం పెట్టారన్న ప్రచారంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచనలేదని.. వేరే పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని మంత్రి ఈటల క్లారిటీ ఇచ్చారు. ఇదంతా సృష్టించిందేనని అన్నారు.టీఆర్ఎస్ ను తీసేస్తే ఈటల పయనం ఎటు అంటే అవన్నీ ఊహాత్మకం అని.. ఇప్పుడే ఏం చెప్పలేనని ఈటల సమాధానాన్ని దాటవేశారు.

ఈటలను ప్రేమించేవారు.. ఉద్యమకారులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారని.. ఆందోళన చేస్తున్న వారిపై ఈటల స్పందించారు. పార్టీ కార్యకర్తలుగా.. నా అభిమానులుగా అందరూ సంయమనంతో ఉండాలని ఈటెల పిలుపునిచ్చాడు. ఎవరూ నా నిజమైన అనుచరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయరని.. సంస్కారవంతంగా.. పద్ధతిగా అలాంటి వ్యతిరేక పనులు చేయవద్దని ఈటల అన్నారు. అలాంటి వాటి వల్ల నష్టమేనని ఈటల అన్నారు.

విచారణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశించడంపై ఈటల స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతుల్లోనే అధికారం ఉందని..వాళ్లు ఎలాగైనా విచారణ చేసుకోవచ్చని.. అక్కడి చూసుకోవాలని.. రాళ్లురప్పలు తప్ప ఏం ఉండవని.. దాచేస్తే నిజం దాగుతుందా? అని ఈటల అన్నారు. గ్రామస్థులకు అంతా తెలుసన్నారు. నా గురించి గ్రామస్థులకు నమ్మకం ఉందన్నారు.

కొందరు అధికారులు అమ్ముడుపోయి పర్సనల్ ఎజెండాతో తనపై ఆరోపణలు చేస్తున్నారని.. సీఎంవో ఆఫీసుకు చెప్పి మరీ భూముల కోసం అడిగానని మంత్రి ఈటల అన్నారు. డబ్బులకే కొంటానని.. ఆ రేటుకే కొంటానని అన్నానని తెలిపారు. కష్టపడి పనిచేసుకుంటానని భూములు అడిగితే ఆరోపణలు చేస్తారా? అని ఈటల అన్నారు.