Begin typing your search above and press return to search.

తెలంగాణ : మోడీ వ‌చ్చే ముందు ఈట‌లకు ఝ‌ల‌క్ !

By:  Tupaki Desk   |   30 Jun 2022 2:43 PM GMT
తెలంగాణ :  మోడీ వ‌చ్చే ముందు ఈట‌లకు ఝ‌ల‌క్ !
X
గ్రేటర్ హైద్రాబాద్ కు చెందిన బీజేపీలో ఒక్క‌సారిగా ఊహాతీత పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపుబీజేపీతో త‌గాదాలు పెట్టుకుంటూనే, మరోవైపు ఆ పార్టీ కార్పొరేట‌ర్ల‌ను త‌మ‌వైపు ఆక‌ర్షించ‌డంలో టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు సఫ‌లీకృతం అయ్యారు. ఇందుకు పలువురు ఎమ్మెల్యేలు తెర వెనుక ఉండి క‌థ నడిపారు అని తెలుస్తోంది.

ఇప్ప‌టికే పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ లాంటి సీనియ‌ర్లకు ఇవి ఓ విధంగా ఏ మాత్రం క‌లిసి రాని ప‌రిణామాలే ! వాస్త‌వానికి వ‌చ్చే నెల 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ స్థాయి స‌మావేశాలు జ‌ర‌గనున్నాయి.

భాగ్య‌న‌గ‌రి కేంద్రంగా జ‌రిగే ఈ స‌మావేశాలకు ముందే న‌లుగురు బీజేపీ కార్పొరేట‌ర్లు తెలంగాణ రాష్ట్ర స‌మితి గూటికి చేరారు. సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవ‌డంతో తెలంగాణ అంతటా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్లో చేరారు.

గులాబీ గూటికి చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాశ్‌, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ ఉన్నారు. వీరికి కేటీఆర్ కండువా కప్పి వారిని స్వాగతించారు.

ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు, మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ రానుండగా, సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.