Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పెట్టం, వారికి టెస్టులు చేయొద్దు!

By:  Tupaki Desk   |   15 Jun 2020 12:10 PM GMT
లాక్ డౌన్ పెట్టం, వారికి టెస్టులు చేయొద్దు!
X
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లాక్ డౌన్ చర్చకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. పైగా ఆ చర్చకు మరింత మద్దతు దొరికేలా మంత్రి తలసాని మాట్లాడారు. అయితే... తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే సమస్యే లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. కేసులు పెరుగుతున్నా ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.

మరోవైపు టెస్టుల విషయంలో ఎందుకో తెలంగాణ ప్రభుత్వం వైఖరి అందరికీ భిన్నంగా ఉంది. నిన్న ముఖ్యమంత్రి వారంలో 50 వేల టెస్టులు చేయమని ఆదేశించారు. అయినా, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాటలు మాత్రం టెస్టులను డిస్కరేజ్ చేసేలాగే ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో ప్రైవేటు ల్యాబులకు, ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వాటికి నిర్ణీత ధరలు నిర్ణయించారు. అయితే, కరోనా లక్షణాలు లేని వారు అడిగినా టెస్టులు చేయొద్దని మంత్రి ఈటల తెలంగాణ లోని ల్యాబ్ లకు సూచనలు చేశారు.

ప్రభుత్వం కూడా కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయదు అని స్పష్టంచేశారు. తెలంగాణలో సామాజిక వ్యాప్తి లేదని, ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ కూడా చెప్పినట్లు ఈటల వివరించారు. ఇదిలా ఉండగా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందుబాటులో ఉంది. మీకు డబ్బులు పెట్టే ఉద్దేశం ఉంటే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొచ్చని, హైదరాబాదులో 12 కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందుబాటులో ఉందన్నారు.

ఢిల్లీ లో కేసులు వేగంగా పెరుగుతున్నా... ఆ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా లాక్ డౌన్ పెట్టమనే చెప్పారు.