Begin typing your search above and press return to search.
ఈఎస్ఐ దాడులు: తెలంగాణలో ఖతం.. ఏపీలో ఎప్పుడు?
By: Tupaki Desk | 11 April 2021 11:00 AM ISTతెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ స్కాం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగుచూసిన తర్వాత ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ శాఖ చూసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే జైలుపాలై బెయిల్ పై విడుదలయ్యాడు. తెలంగాణలోనూ పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వందల కోట్ల విలువైన ఈ స్కామ్ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వెలుగుచూసింది.
తాజాగా తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ నిందితుల ఇళ్లపై ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ స్కామ్ గుట్టు బయటపడిన నెలుల, సంవత్సరాలు గడుస్తున్నా ఈడీ దాడుల్లో తాజాగా నిందితుల ఇళ్లలో కోట్ల రూపాయల నగదు పట్టుబడడం చర్చనీయాంశమైంది. కేసుల బాధ ఉండి కూడా వీరు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నారంటే వారి గట్స్ కు ఫిదా కావాల్సిందే.అంత ధైర్యంగా అన్ని కోట్లు అట్టి పెట్టుకోవడం చూసి అధికారులు సైతం ఆశ్చర్య పోతున్నారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇళ్లలోనే రైడ్స్ జరగడం కలకలం రేపాయి. అది కూడా ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. తెలంగాణలో దాడులతో ఏపీలో వాతావరణం వేడెక్కింది. ఏపీలో కూడా వందల కోట్ల రూపాయల విలువైన ఈఎస్ఐ స్కాం జరిగిందని ఏసీబీ ధ్రువీకరించింది. ఇందులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు.
తెలంగాణలో దాడులతో అక్కడ ఈఎస్ఐ స్కాం డొంక కదలింది. ఇక ఏపీలోనూ కదలాలని ఈడీ దాడులు ఎప్పుడు చేస్తుందోనన్న భయాందోళనల్లో ఇక్కడి నిందితులు ఉన్నారు. ఈడీ దాడులు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని చెబుతున్నారు.