Begin typing your search above and press return to search.

అతడికి ఇంకా భూమిపై నూకలున్నాయి.. రెప్పపాటులో కోబ్రా కాటు నుంచి ఎస్కేప్

By:  Tupaki Desk   |   15 Jan 2021 6:00 AM IST
అతడికి ఇంకా భూమిపై నూకలున్నాయి.. రెప్పపాటులో  కోబ్రా కాటు నుంచి ఎస్కేప్
X
పాము పాలు పోసినా అది విషమే కక్కుతుంది అని పెద్దలు చెబుతారు. అది అక్షరాలా నిజమని మరోసారి నిరూపితం అయ్యింది. ప్రాణాపాయంలో ఓ కోబ్రాని స్నేక్ క్యాచర్స్ కాపాడే ప్రయత్నం చేయగా అది వారిపై బుసలు కొట్టింది. ఇక కాటేయడం ఖాయం అనుకున్న సమయాన స్నేక్ క్యాచర్ చాకచక్యంగా, భయం లేకుండా దాని బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

వీడియోలో ఆ కోబ్రాను చూస్తేనే పై ప్రాణాలు పైనే పోయేలా ఉంది. ఎంతో ధైర్యంగా కోబ్రాను ఎదుర్కొని ప్రాణాలతో బయట పడ్డ స్నేక్ క్యాచర్, అతడికి అండగా నిలిచిన వ్యక్తికి నెటిజన్లు హ్యాట్సప్ చెబుతున్నారు.

ఆ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ సమీపంలోని అడవిలో ఓ చెట్టు బెరడులో అతి పెద్ద కోబ్రా చిక్కుకుపోయి అవస్థలు పడుతుండటం స్నేక్ క్యాచర్, మరో వ్యక్తి గమనించారు. దానిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. స్నేక్ క్యాచర్ చెట్టు బెరడులో ఇరుకున్న కోబ్రాను బయటకు తీస్తుండగా అదే సమయంలో వెంట ఉన్న వ్యక్తి వెనకాల నుంచి కోబ్రా తోక పట్టుకున్నాడు. దీంతో కోబ్రాకు చిర్రెత్తుకొచ్చింది.వెంటనే బుసలు కొడుతూ స్నేక్ క్యాచర్ మోకాలిపై కాటేయబోగా అతడు వెంటనే దాన్ని నీటిలో తోసేసాడు.

ఆ క్రమంలో అతడు పట్టు తప్పి కింద పడగా ఆలోగా మళ్ళీ వచ్చిన కోబ్రా స్నేక్ క్యాచర్ని కాటేయబోగా వెంట వున్న వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. రెప్పబాటులో కాటేయబోతుందనగా స్నేక్ క్యాచర్ అప్రమత్తం అయ్యి దాన్ని ఒంటి చేత్తో దాని మెడ అదిమి పట్టుకున్నాడు. చివరికి ఆ కోబ్రాను అడవిలో వదిలేసారు. కోబ్రాతో ఫైట్ చేసి బయటపడ్డ ఆ ఇద్దరి సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కోబ్రాతో వారు పోరాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.