Begin typing your search above and press return to search.

రూ.2 వేల నోటుపై తప్పుడు ప్రచారం

By:  Tupaki Desk   |   12 Nov 2016 9:40 AM GMT
రూ.2 వేల నోటుపై తప్పుడు ప్రచారం
X
పాత 500 - 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో ప్రవేశపెట్టిన 500 - 2000 నోట్లలో 2 వేల నోటును ప్రభుత్వం వెనక్కు తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణాలు కూడా ప్రచారమవుతున్నాయి. కొత్త రూ.2 వేల నోట్లపై వివిధ భాషల్లో రాసిన రాతల్లో తప్పులున్నాయని.. దాంతో వాటిని వెనక్కు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం మాత్రం దానిపై ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. నిజానికి అందులో తప్పు కూడా ఏమీ లేదు. భాషలపై అవగాహనలేని వారు చేస్తున్న ప్రచారం మాత్రమే అది.

2 వేల నోటు వెనుక భాగంలో రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేలా మొత్తం 15 భారతీయ భాషల్లో ముద్రించారు. అందులో దేవనాగరి లిపిలో 'దోన్ హజార్ రూపయా" - 'దోన్ హజార్ రుపయే" అని రెండు రకాలుగా ఉంది. దీంతో హిందీలో రెండు రకాలుగా రాశారన్న ప్రచారం జరుగుతోంది. పైగా హిందీలో దోన్ అనరని... దో అని మాత్రమే అంటారని... కాబట్టి అది తప్పంటూ జనం సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. అక్షర దోషాలతో ఈ నోట్లను ముద్రించారని - ఈ నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపిస్తున్నాయి.

నిజానికి అదేమీ తప్పుకాదు... 'దోన్ హజార్ రూపయా" - 'దోన్ హజార్ రుపయే" అనే రెండూ హిందీ కాదు. హిందీ భాష రాసేందుకు వాడే లిపి దేవనాగరిని హిందీతో పాటు సంస్కృతం వంటి ఇతర భాషల రాతకు కూడా వాడుతారు. ఈ నోటుపై అసలు హిందీలో రాయనేలేదు. హిందీలా కనిపిస్తున్న ఈ రెండింటిలో ఒకటి కొంకణి, ఇంకోటి మరాఠీ భాషలో రాసింది. అందులో దోన్ హజార్ రుపయే అన్నది మరాఠీ కాగా... దోన్ హజార్ రుపయా అన్నది కొంకణి భాష. అదీ అసలు సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/