Begin typing your search above and press return to search.

రేవంత్ తో ఎర్రబెల్లి రాజీ పడ్డారా?

By:  Tupaki Desk   |   15 Sept 2015 6:45 AM
రేవంత్ తో ఎర్రబెల్లి రాజీ పడ్డారా?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని అంతర్గత పోరు ఒక కొలిక్కి వచ్చిందా? ఇంతకాలం చాప కింద నీరులా సాగిన అధిపత్య పోరు ఒక కొలిక్కి వచ్చేసి రాజీ ఫార్ములా కుదిరిందా? తనలోని లోపాల్ని గుర్తించి ఎర్రబెల్లి వెనక్కి తగ్గారా? లేక.. ఎర్రబెల్లి పెద్దరికాన్ని తాను ప్రశ్నించనని.. కాకుంటే తనకు అండగా నిలవాలన్న రేవంత్ మాటను మన్నించారా? లాంటి ప్రశ్నలు రేగుతున్నాయి.

కలిసే ఉన్నప్పటికి.. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి.. రేవంత్ రెడ్డిల మధ్య సరైన సంబంధాలు లేవని చెబుతారు. ఓటుకు నోటు కేసుకు ముందు వరకు ఇరువురి మధ్య లొల్లి ఓ రేంజ్ లో ఉండేదని.. ఒకదశలో మాటలు కూడా తగ్గిపోయాయని చెబుతారు. అయితే.. ఓటుకు నోటు వ్యవహారంతో తెలంగాణ రాష్ట్ర సర్కారుతో ముఖాముఖిన తలపడేందుకు రేవంత్ సిద్ధం కావటం.. ఆయన స్థాయిలో తాను పోరాడలేనన్న విషయం అర్థమై.. రేవంత్ కు సహకారం అందించేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.

అదే సమయంలో.. రేవంత్ పోరాటానికి.. ఎర్రబెల్లి నైతిక మద్ధతు ఇవ్వాలన్న సూచన అధినేత చంద్రబాబు చేయటంతో అయిష్టంగా అయినా ఎర్రబెల్లి ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. అయితే.. పార్టీలో ఇప్పుడున్న పెద్దరికపు హోదాను కొనసాగిస్తామని.. ఆ విషయంలో తాను పోటీ పడనంటూ రేవంత్ ఇచ్చిన హామీ ఎర్రబెల్లికి ఉపశమనం లభించినట్లు చెబుతున్నారు. అధికారికంగా ఎర్రబెల్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం.. అదే సమయంలో అనధికారికంగా రేవంత్ చెలరేగిపోతే.. చూసీ చూడనట్లుగా ఉండాలన్న రాజీ ఫార్ములాకు ఇరువురు నేతలు ఓకే చెప్పేయటంతో.. ఎర్రబెల్లి.. రేవంత్ మధ్య కోల్డ్ వార్ ఒక కొలిక్కి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. మరి.. ఇదెంత వరకు నిజమన్నది కాలమే చెప్పాలి.