Begin typing your search above and press return to search.
ఇండియాలో ఇది ఫస్ట్ డిజిటల్ విలేజ్
By: Tupaki Desk | 1 Oct 2015 3:44 PM ISTఎరవిపెరూర్... కేరళ రాష్ట్రంలో ఈ గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోనే మొట్టమొదటగా ఈ గ్రామం ఊరంతా ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తోంది. ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. గ్రామం నుంచి కిలోమీటరు వ్యాసార్థం వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తుండడంతో చుట్టూ ఉన్న కోజిమలా - వల్లాంకులం - ఒథేరా - నన్నూర్ గ్రామాలు కూడా ఈ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని పొందగలుగుతున్నాయి. గ్రామస్థులు అందరితో మాట్లాడి సర్పంచి రాజీవ్ ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
అయితే... ఊరంతటికీ వైఫై సౌకర్యం కల్పించేందుకు ఖర్చు బాగానే అయ్యింది. అందుకు అవసరమైన పరికరాలు, టెక్నికల్ సపోర్టు కోసం రూ.4.17 లక్షలు ఖర్చయ్యాయి. యాక్టివ్ ఇన్ఫోకామ్ లిమిటెడ్ అనే సంస్థ సహకారంతో ఇదంతా సాధ్యమైంది. మరోవైపు ఈ గ్రామంలో ఈ లిటరసీ ప్రోగ్రాం కూడా అమల్లో ఉంది.
ఎరవిపెరూర్ గత అయిదేళ్లుగా అభవృద్ధిలో దూసుకెళ్తోంది. ప్రజాపాలన విభాగంలో ఈ ఊరికి ఈ ఏడాది ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. అంతేకాదు.. జీవవైవిధ్యం విషయంలో రాష్ట్ర అవార్డులు అందుకుంది.
అంతేకాదు... ఈ ఊర్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా అద్భుతంగా పనిచేస్తోంది. ప్రతి విషయం ప్రజలకు ఎస్సెమ్మెస్ ల రూపంలో వెళ్తుంది. ఈ విధానానికి, ఇక్కడి ప్రజారోగ్య కేంద్రానికి ఐఎస్ ఓ సర్టిఫికేషన్ దక్కడం కూడా గొప్ప విషయమే.