Begin typing your search above and press return to search.

25 శాతం లోపు ప్రవేశాలున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు క్లోజ్ !

By:  Tupaki Desk   |   8 Sept 2020 2:40 PM IST
25 శాతం లోపు ప్రవేశాలున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు క్లోజ్ !
X
ఇంజినీరింగ్ .. గతంలో ఎంతో డిమాండ్ ఉన్న కోర్స్. కానీ , రోజురోజుకి ఇంజినీరింగ్ కి డిమాండ్ తగ్గడంతో పాటుగా విద్యార్థులు ఇంజినీరింగ్ చేసినా జాబ్స్ లేవని , సాధారణ డిగ్రీ చేస్తుండటంతో ఒకప్పుడు మంచి ఫెమ్ సంపాదించుకున్న కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు సైతం కనిపించకుండా కాల గర్భంలో కలిసిపోతున్నాయి. కళాశాలల స్థితిగతులు, విద్యార్థులు, లెక్చరర్ల సంఖ్యపై ప్రభుత్వం నిఘా పెంచటంతో కళాశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆడ్మిషన్ల సంఖ్య 25 శాతం కన్నా తక్కువగా ఉన్న కాలేజీలు ఈ ఏడాది ఆడ్మిషన్లకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు, నాణ్యత లేని కళాశాలల గుర్తింపు రద్దు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇకపొతే, ఒక్క గుంటూరు జిల్లా పరిధిలో 40 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో అన్ని రకాల కోర్సులకి 16,910 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరు కళాశాలలు 25 శాతం కన్నా తక్కువ అడ్మిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి కారణం కళాశాలల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేకపోవటమే. గత నాలుగైదేళ్లుగా ఈ కళాశాలలు కనీస స్థాయిలో ఆడ్మిషన్లు పొందటానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులకు డబ్బులిచ్చి మరీ ప్రవేశాలు పొందుతున్నాయి. అందుకోసం మా కాలేజీలో చేరండి లాప్‌ ట్యాప్‌ ఉచితం. ల్యాబ్‌ ఫీజు పూర్తిగా రద్దు, బస్‌ ఫీజు నామమాత్రంగా వసూలు చేస్తాం. హాస్టల్‌ ఫీజు భారీగా తగ్గిస్తాం...మీకు ఏమైనా డిమాండ్లు ఉంటే చెప్పండి తీరుస్తాం అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే , ఇలాంటి కాలేజీలు కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో నెట్టుకొస్తున్నాయి.

ఈ పరిస్థితిని గుర్తించి 2017లో జిల్లాలో తక్కువ అడ్మిషన్లు పొందుతున్న కళాశాలల సీట్లలో కొంత మేర కోత విధించింది. జిల్లాలో ఒక్కో కళాశాలలో 60 నుంచి 200 దాకా కోత పడి సుమారు ఐదు వేల సీట్లను రద్దు చేశారు. ఇక ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకి మళ్లీ కాలేజీలు తెరచే వరకు ఒకటమైన కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారు. అలాగే కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకి యాజమాన్యాలు 10 మంది విద్యార్థులను చేర్చాలన్న టార్గెట్లు పెడుతుంటాయి. దీంతో సిబ్బందికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇకపోతే , ఇప్పట్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తుండటంతో ఈ దుస్థితికి కారణం ప్రమాణాలు లేని ఇంజినీరింగ్‌ చదువులే. సీట్లు తగ్గి, వాటి నాణ్యతపై నిఘా పెడితే ప్రమాణాలు పెరిగి విద్యార్థులు కోర్సులు పూర్తి చేసి, మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది.